వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశాడు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరుఫున తాను ప్రచారం చేస్తానని చింతమనేని ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అనూహ్య పరిణామాలపై చింతమేనేని తీవ్రంగా స్పందించారు.నామినేషన్లు వేసి వైసీపీ నేతల భయానికి విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై చింతమేనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న డివిజన్లలో బీజేపీ-జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరుఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నారని సీరియస్ అయ్యారు.
పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్ ఉండదన్నారు. టీడీపీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని చింతమనేని హామీ ఇచ్చారు. విత్ డ్రా చేసుకున్న టీడీపీ అభ్యర్థుల డివిజన్లలో జనసేన-బీజేపీ అభ్యర్థులు ఉంటే వారి తరుఫున తాను ప్రచారంలో పాల్గొంటానని చింతమేనని ప్రకటించారు.చింతమనేని ప్రకటనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వేడెక్కాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో దెందులూరు నియోకవర్గ నేత చింతమనేని ప్రభాకర్ జోక్యం చర్చనీయాంశంగా మారింది.