ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై సమీక్షలు నిర్వహించుకుంటున్నాయి. ఇందులో అధికార తెలుగుదేశం పార్టీ అన్నింటి కంటే ముందుంది. ఎన్నికలకు ముందు నియమించిన బూత్ కన్వీనర్ల ద్వారా ఆ పార్టీ అధిష్ఠానం వివరాలు రాబట్టుకుంటోంది. ఇప్పటికే ఈ విషయమై టీడీపీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో అంత సీరియస్ గా లేదు. ఆ పార్టీ అధిష్ఠానం విజయంపై ధీమాతో ఉండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో వైసీపీ విజయం తథ్యమనే టాక్ కొద్దిరోజులుగా వినిపించడంతో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి వాటి జోలికి వెళ్లడం లేదు.
కానీ, ఆ పార్టీ నేతలు మాత్రం తమ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం చూపిన కర్నూలు జిల్లాలో జరిగిన ఓటింగ్ సరళిపై ఇటీవల వైసీపీ నాయకులు రివ్యూ చేసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిన జిల్లాల్లో కర్నూలు ఒకటి. ఈ జిల్లాలో కర్నూలు - నంద్యాల లోక్ సభ స్థానాలు - 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హవా సాగించి అధికారం చేజిక్కించుకున్న టీడీపీ జిల్లాలో కేవలం 3 అసెంబ్లీ స్థానాలకు సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ కర్నూలు జిల్లాపై బాగా ఫోకస్ చేసింది. అక్కడ ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు పని చేశారు.
ఈ ప్రయత్నంలోనే టీడీపీకి భారీ నష్టం చేకూరింది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కేఈ కుటుంబం - భూమా కుటుంబం అండగా ఉంది. మరిన్ని స్థానాలను దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో కోట్ల కుటుంబాన్ని - గౌరు సుచరిత ఫ్యామిలీని తమ పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. అయితే, ఈ చేరికలే టీడీపీ కొంప ముంచాయని తెలుస్తోంది. అప్పటి వరకు విరోధులుగా ఉన్న ఈ కుటుంబాలు ఒకరికొరకు సాయం చేసుకోకపోవడంతో పాటు - కార్యకర్తల్లో సఖ్యత నెలకొనని కారణంగా అక్కడ టీడీపీ ఓట్లకు భారీగా గండి పడిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలు వేసుకున్న లెక్కల్లో ఇది స్పష్టమైనట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకునే విషయాన్ని పక్కన పెడితే.. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాలను కూడా ఆ పార్టీ ఖాతాలో వేసుకునే పరిస్థితి కనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కర్నూలు జిల్లాలో మరోసారి వైసీపీ హవా చూపించబోతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.