ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీల అమలు కోసం కేంద్రంపై వైసీపీ - టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల - లోపల రకరకాల ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రధాని మోదీ - బీజేపీపై తమ నిరసన తెలపారు. అయితే, తెలుగు ఎంపీలందరిలో కెల్లా సినీ నటుడు - చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్....కు మాత్రం జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. పూటకో వేషం వేస్తూ పార్లమెంటు వెలుపల వినూత్న తరహాలో నిరసన తెలిపిన శివప్రసాద్....జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. మత్స్య కారుడు - సత్య హరిశ్చంద్ర - కోయదొర - రైతు - చర్చి ఫాదర్ - శ్రీకృష్ణుడు - హిజ్రా....ఇలా రకరకాల వేషాలు వేసి వార్తల్లో నిలిచారు. అయితే, హోదా కోసం శివ ప్రసాద్ వేసిన వేషాలు ....మీడియాను ఆకట్టుకున్నాయి...కానీ....ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆకట్టుకోలేకపోయాయని విమర్శలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ టికెట్ ను శివప్రసాద్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించిందని వదంతులు వినిపిస్తున్నాయి.
చిత్తూరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన శివప్రసాద్...మూడోసారి ముచ్చటగా ఎంపీ అవుదామనుకున్నారు. అయితే, ఈ సారి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు విముఖంగా ఉన్నారని టాక్. శివ ప్రసాద్ వేషాల సంగతి ఎలా ఉన్నా....ఆయనకు టికెట్ దక్కే పరిస్థితి మాత్రం లేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. తన సన్నిహితుడు శివ ప్రసాద్ ను పక్కన పెట్టాలని బాబు యోచిస్తున్నారని టాక్. జిల్లా యంత్రాంగం మీద శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు...వివాదాస్పదం కావడం - ఆయన ప్రవర్తన...వంటి కారణాలతో టికెట్ దక్కే చాన్స్ లేదని పార్టీలో అంతర్గతంగా అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆశావహులు ఆ స్థానం కోసం క్యూ కట్టారట. వర్ల రామయ్యతో పాటు ఈనెల లో పదవీ విరమణ చేయబోతోన్న శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ వీసీ ఆవుల దామోదరం - మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆ స్థానం కోసం కర్చీఫ్ వేశారట. వారితో పాటు ఆశావహుల సంఖ్య పెరిగిపోతోందట. అయితే - తనకు సన్నిహితుడైన బాబు....తనకే టికెట్ ఇస్తారని శివప్రసాద్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట.