వైసీపీ క‌న్నా టీడీపీనే బెట‌ర్‌.. జ‌మ్మ‌ల‌మ‌డు నేతల మాట‌!

Update: 2021-08-28 00:30 GMT
రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. వైసీపీలోకి వ‌స్తే.. త‌మ‌కేదో ఒరుగుతుంద‌ని.. భావించి.. ద‌శాబ్దాలుగా అండ‌గా ఉన్న టీడీపీని వ‌దులుకుని.. సైతం జ‌గ‌న్ చెంత‌కు వ‌చ్చి జై కొట్టారు. అయితే. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డి రెండున్నేళ్లు పూర్త‌యినా.. ఇలాంటి వారికి ఎక్క‌డా ఎలాంటి గుర్తింపూ ల‌భించ‌డం లేదు. దీంతో జంపింగ్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మ‌థ‌న ప‌డుతున్నారు. సాక్షాత్తూ.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ ఇలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున ఎదురులేని నాయకుడిగా ఎదిగారు రామ‌సుబ్బారెడ్డి.

గ‌త ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీని వ‌దిలేసి.. వైసీపీలోకి చేరారు రామ‌సుబ్బారెడ్డి. టీడీపీ ఆవిర్భావం నుం చి ఆ పార్టీలో కొనసాగిన రామసుబ్బారెడ్డి కుటుంబం... 2014లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఆదినారాయ‌ణ‌రెడ్డిని చంద్ర‌బాబు టీడీపీలోకి చేర్చుకోవ‌డంతో క‌లిసి ప‌నిచేయాల్సి వ‌చ్చింది. అయితే.. అప్ప‌ట్లోనూ ఇలా.. మ‌థ‌న‌ప‌డింది లేదు. కానీ, ఇప్పుడు వైసీపీలో రామ‌సుబ్బారెడ్డికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింద‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకునేవారు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

అంతేకాదు.. ఇక్క‌డ నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడు సుధీర్‌రెడ్డి అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఎవ‌రూ ఆయ‌న‌ను మాట‌ను దాట‌లేక‌పోతున్నారు.పైగా పార్టీ అధిష్టానం కూడా సుధీర్ కే ప‌గ్గాలు అప్ప‌చెప్పింది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో సుధీర్‌పై త‌ల‌ప‌డిన రామ‌సుబ్బారెడ్డి.. ఓడిపోయాక‌.. వైసీపీలోకి వ‌చ్చారు. నామినేటెడ్ ప‌ద‌వి అయినా ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గుర్తింపు లేక‌పోగా.. క‌నీసం.. పార్టీ నేత‌ల నుంచి ప‌ల‌క‌రింపులు కూడా కరువ‌య్యాయి.  అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుధీర్ రెడ్డికే ప్రాధాన్యం  ఉంటుందని, ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌జ‌రుగుతోంది.

దీంతో సుధీర్‌రెడ్డి.. వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డిల మ‌ధ్య వివాదాలు నిత్యం సర్వ‌సాధార‌ణంగా మారాయి. ఈ నేప‌థ్యంలో రామసుబ్బారెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోతారని చర్చ మొదలైంది. అయితే.. ఈ చ‌ర్చ‌ను రామ‌సుబ్బారెడ్డి అంగీక‌రించ‌డం లేదు. అయితే.. రామ‌సుబ్బారెడ్డి మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి వెళ్లలేదు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో ఉంటారా లేదా అన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. కేడర్‌ కూడా ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట. దీంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తనను గౌరవించే టీడీపీలోకే తిరిగి వెళ్లే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్టు టాక్‌.  మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి
Tags:    

Similar News