తెలుగుదేశం పార్టీ మరో భారీ కార్యక్రమం చేపట్టేందుకు సన్నద్ధమైంది. నవంబర్ 1 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షులు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం వద్ద ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. చంద్రబాబునాయుడు స్వయంగా సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పార్టీ తెలిపింది. కార్యకర్తల సంక్షేమ విభాగానికి చెందిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా చంద్రబాబునాయుడు పాల్గొంటారు. అనంతరం ఒంగోలులో జరిగే జనచైతన్యయాత్రలో ఆయన పాల్గొంటారు.
రాబోయే పురపాలక - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తేదీలను ఖరారు చేస్తూ నవంబర్ 1న అందుకు శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదును మంత్రులు సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలు * నియోజకవర్గ ఇంచార్జీలు ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు ఆధారంగానే పార్టీ పదవుల్లో నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈ దఫా సభ్యులపై ఆసక్తి నెలకొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/