ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల నేతలకు పెద్ద యుద్ధం నడుస్తోంది. అయితే జగన్ పిఆర్సీపై ఎట్టకేలకు ప్రకటన చేసినా కూడా ఉద్యోగ సంఘాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఉద్యోగ సంఘాల తీరుపై మాజీ ఉద్యోగ సంఘాల నేత, టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందల్లా వింటూ ఉద్యోగ సంఘాల నేతలు అక్కా, బావ మాటలు మాట్లాడుతున్నారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వకూడదని.. ఒకవేళ ఇచ్చినా ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఉందని అశోక్ బాబు ఆరోపించారు.
ఐఏఎస్‌లుగా ఉన్న వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ? చెబితే అలా నివేదికలు తయారు చేయటం ఏంటని ఆయన విమర్శించారు. అసలు గత పది సంవత్సరాలలో ఇలాంటి ఫిట్‌మెంట్లు తాము ఎప్పుడూ చూడలేదని చెప్పిన అశోక్ బాబు... ఇది ఉద్యోగులు చేసుకున్న దౌర్భాగ్యం అని అన్నారు. అది కూడా పిఆర్సీ అక్టోబర్ 2022 నుంచి అమలు చేస్తామని చెప్పడం కూడా చాలా దుర్మార్గం అని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు ఇన్నోవా కార్లలో తిరుగుతూ ఉంటే.. కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం ఎన్నో బాధలు పడుతున్నారు... అని వాటిని గుర్తించాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వలంటీర్లు, సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రు. 6700 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన చెప్పారు. అవి లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్ని కష్టాలు ఉండేవి కావని ఆయన చెప్పారు.
ఐఆర్ 27 శాతం ఉంటే... 14 శాతం చాలని ఎలా నివేదిక ఇస్తారని.. జీతాలు పెంచమంటే ఎలా ? తగ్గిస్తారని అశోక్‌బాబు ప్రశ్నించారు. ఏదేమైనా దేశంలోనే తాము తొలిసారిగా రివర్స్ పీఆర్సీ చూస్తున్నామంటూ ఆయన మండిపడ్డారు.