తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ మంత్రి అయిపోయారు. ఆమె కోరని పదవి అది. తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభానాగిరెడ్డి సుదీర్ఘకాలం రాజకీయం చేసినా మంత్రి మాత్రం కాలేకపోయారు. అలా వారి వారసురాలిగా రంగంలోకి దిగిన అఖిలప్రియ చిన్న వయసులోనే ఫస్ట్ అటెంప్ట్ తోనే మినిస్టర్ అనిపించేసుకున్నారు. అయితే ఆ అత్యున్నత హోదాని ఆమె నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు.
మంత్రిగా ఆమె పనితీరు పూర్ అని టీడీపీలోనే అనుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఆమె ఆళ్ళగడ్డ నియోజకవర్గం ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. అంతే కాదు ఆమె తన తండ్రి భూమా నాగిరెడ్డి ఘనమైన రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. ఎపుడూ వివాదాలు గొడవలతో ఆమె 2019 లో ఓడిన తరువాత నుంచి వార్తలలో కనిపిస్తున్నారు.
ఇక కుటుంబంలో చూస్తే ఆమెకు ఎవరితోనూ పడదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తన సొంత అన్న బ్రహ్మానందరెడ్డి విషయంలోనూ ఆమె నంద్యాలలో మోకాలడ్డుతున్నారు. ఇక ఇంట్లో చెల్లెలు మౌనికా రెడ్డితోనూ ఆమెకు విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దాంతో పాటు ఆళ్లగడ్డలో ఎవరైతే భూమా నాగిరెడ్డికి మంచి దోస్తులుగా ఉన్నారో ఆయనతో పాటు ఏళ్ళ తరబడి కలసి నడిచారో వారందరికీ ఆమె దూరం చేసుకున్నారు అని అంటున్నారు.
దాంతో ఆమెకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ ఇష్టపడడంలేదని ప్రచారంలో ఉంది. ఇదే అదనుగా ఆమె చెల్లెలు మౌనికారెడ్డి పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. మౌనికారెడ్డికి అక్క అఖిలప్రియతో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరు అక్కా చెల్లేళ్ళ మధ్య మాటలు కూడా లేవు అని అంటున్నారు.
ఈ మధ్యన ఆళ్ళగడ్డ వచ్చిన మౌనికారెడ్డి తన అక్కను కనీసంగా పలకరించలేదని, వారి ఇంటికి కూడా వెళ్లలేదని అంటున్నారు. అలాగే అక్క కొడుకు పుట్టిన రోజున కూడా గ్రీట్ చేయలేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో అళ్ళగడ్డకు వచ్చిన మౌనికారెడ్డి తన తల్లి శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో విడిగానే పాల్గొన్నారు. ఇంకో వైపు చూస్తే ఆమె సినీ నటుడు మంచు మనోజ్ తో కలసి ఉంటున్నారు. ఈ ఇద్దరూ తొందరలోనే పెళ్ళి చేసుకుంటారు అని అంటున్నారు.
ఇది మనోజ్ కి ఆమెకు కూడా రెండవ వివాహమే అని చెబుతున్నారు. ఇక మనోజ్ మౌనికల పెళ్ళి ఫిబ్రవరిలో జరుగుతుంది అని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో మౌనికారెడ్డి ఆళ్లగడ్డ నుంచి టీడీపీ టికెట్ మీద పోటీ చేయడం ద్వారా చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఆళ్ళగడ్డ అంటే ఎటూ భూమా ఫ్యామిలీకి పట్టున్న సీటు. రెండు సార్లు టికెట్ అఖిలప్రియకు ఇస్తే ఆమె ఒకసారే గెలిచారు. దాంతో 2024లో సరైన క్యాండిడేట్ కోసం బాబు చూస్తున్నారు అని అంటున్నారు
ఇపుడు సడెన్ ఎంట్రీ మౌనిక ఇస్తోంది అని చెబుతున్నారు. ఆమె కనుక ముందుకు వస్తే బాబు ఆమె పేరు పరిశీలించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక మంచు మోహన్ బాబు కూడా చంద్రబాబుతో ఈ మధ్య తన రిలేషన్స్ మళ్ళీ గట్టి పరచుకున్నారు. అదే విధంగా బాలయ్యతో కూడా మోహన్ బాబు ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలసి చూస్తే మౌనికారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వడానికే చూస్తారని అంటున్నారు. దాంతో పాటు అఖిలప్రియను తప్పించినా భూమా కుటుంబం టీడీపీతోనే ఉంది అన్న సంకేతాలను క్యాడర్ కి పంపించడానికి కూడా బాబుకు అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
మొత్తానికి మౌనిక రెడ్డి మౌనంగానే పావులు కదుపుతున్నారు అన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ మౌనికా రెడ్డి ఎంట్రీ ఇస్తే ఆళ్ళగడ్డలో అక్కా చెల్లెళ్ళ మధ్యనే రాజకీయం రంజుగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మౌనికా రెడ్డి వెనక ఉన్న మనోజ్ కి కూడా రాజకీయాల మీద ఆకాంక్ష ఉంది. ఆయన కూడా మౌనికకు ఫుల్ సపోర్ట్ గా నిలిస్తారని, చివరికి చెల్లెమ్మ అఖిలమ్మకు చెక్ పెట్టనుంది అని అంటున్నారు.