పలమనేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి పోలీసులు మీద చిందులు తొక్కారు. తమ పార్టీ అభ్యర్థిని ఒకరు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంపై ఆయన మండి పడ్డారు. ఈ విషయంలో పోలీసులు ఆమెకు సహకరించారని అంటూ, పోలీసులే ఆమె చేత నామినేషన్ ను విత్ డ్రా చేయించారని అంటూ... అమర్ నాథ్ రెడ్డి మండిపడటం గమనార్హం. పోలీసులపై ఆయన చిందులు తొక్కుతూ బూతులు తిట్టారట. అలాగే తన టైమ్ వచ్చినప్పుడు వారిని తొక్కేస్తానంటూ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా సమాచరాం. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు వీడియోగా తీసి, తమ పై అధికారులకు పంపించారట!
ఇంతకీ ఏం జరిగిందంటే.. పలమనేరు నియోజకవర్గంలో ని ఒక ఎంపీటీసీ స్థానానికి మామడుగు కామాక్షమ్మ అనే మహిళ ముందుగా నామినేషన్ వేసిందట. తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె నామినేషన్ వేసింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవాలని అనుకున్నారట. ఆ మేరకు ఆమె నామినేషన్ ను వెనక్కు తీసుకోవడానికి బయల్దేరగానే అక్కడ తెలుగుదేశం నేతలు ఆపే ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. నామినేషన్ ను ఉపసంహరించుకోవద్దంటూ వారు ఒత్తిడి చేయసాగారట. దీంతో సదరు మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
తను నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా, దానికి టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారట. దీంతో అక్కడకు పోలీసులు వచ్చి, ఆమెకు భద్రత కల్పించారు. ఆమె విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లడానికి పోలీసులు సహకారం అందించారు. దీంతో స్థానిక టీడీపీ ముఖ్య నేత అమర్ నాథ్ రెడ్డికి కోపం వచ్చేసిందట!
వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులపై మండి పడ్డట్టుగా తెలుస్తోంది. తమ పార్టీ అభ్యర్థిపై పోలీసులే ఒత్తిడి చేసి నామినేషన్ విత్ డ్రా చేయించారంటూ ఆయన విరుచుకుపడ్డట్టుగా సమాచారం. పోలీసులను బూతులు తిట్టారట ఈ మాజీ మంత్రి. తన టైమ్ వచ్చినప్పుడు అందరినీ కాలితో తొక్కేస్తానంటూ హెచ్చరిక కూడా జారీ చేశారట!