ముందు కొడుకు... తరువాత టీడీపీ మాజీ మంత్రి... ?

Update: 2021-11-13 00:30 GMT
ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కాదు అంటాడు వెనకటి గురజాడ కన్యాశుల్కం గీరీశం. అయితే వరసబెట్టి పార్టీలు మార్చకపోతే మాత్రం గట్టి నాయకుడు అనిపించుకోడు అన్నది నయా పాలిటిక్స్ నీతి. ఈ విషయాన్ని బట్టీ పట్టిన బహు మొనగాళ్ళు చాలా మంది ఉన్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రూటే సెపరేట్ అంటున్నారు.

ఆయన రాజకీయం రెండు దశాబ్దాల కాలం అయితే ఎన్నో పార్టీలు మారిన చరిత్ర ఉంది. అయితే పార్టీ మారిన ప్రతీసారి ఆయన భారీ లాభాలనే చూశారు. ఆయన తొలిసారిగా 1999లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీ అయ్యారు. ఆ తరువాత అదే పార్టీ నుంచి చోడవరం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2008లో ప్రజరాజ్యం పార్టీలో చేరారు. 2010లో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం కలవడంతో గంటా ఏకంగా కాంగ్రెస్ మంత్రి అయిపోయారు.

ఇక 2014లో తిరిగి టీడీపీలో చేరి అయిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలోకి రావాల్సింది జరగలేదు. ఈ సెంటిమెంట్ తప్పడం వల్లనే ఆయన అధికారానికి దూరం అయ్యారన్న ప్రచారమూ ఉంది. అయితే ఇపుడు ఆ తప్పు అసలు చేయదలచుకోలేదు అంటున్నారు.

ఆయన చూపు జనసేన మీద ఉంది. ఆయనకు మెగాస్టార్ చిరంజీవితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇపుడు తమ్ముడు పవన్ పెట్టిన జనసేనలో ఆయన కీలకంగా మారుతారు అంటున్నారు. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలల్లో పార్టీ బాధ్యతలు తాను చూసుకునేలా ఆయన పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది.

జనసేనలో గంటా చేరితే తనతో పాటు అతి పెద్ద అనుచర గణం కూడా చేరుతుందని చెబుతున్నారు. వారందరికీ సీట్లు అకామిడేట్ చేస్తేనే ఆయన జనసేనలోకి వస్తారని అంటున్నారు. ఇక జనసేనలో ఆయన ముందు తన కుమారుడుని పంపింస్తారు అంటున్నారు.

తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నందున పార్టీ మారితే టెక్నికల్ గా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొడుకుని పంపించి జనసేనలో తన బెర్త్ ని కంఫర్మ్ చేస్తుంటారు అన్నదైతే గట్టిగా వినిపిస్తోంది. ఆ తరువాత గంటా మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరుతారు అంటున్నారు. ఇదిలా ఉంటే గంటా ఈ మధ్య పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ లో ఆయన సభ ఏర్పాట్లకు తెర వెనక సాయం చేశారని కూడా అంటున్నారు.

మొత్తానికి మంచి సుహృద్భావ వాతారణంలోనే జనసేనతో గంటా చర్చలు జరుగుతున్నాయని టాక్ అయితే నడుస్తోంది. ఇక టీడీపీలో కూడా ఎక్కడా అలికిడి లేని ఈ మాజీ మంత్రి మరోసారి పార్టీ మారడం అయితే ఖాయం అన్నదే ప్రచారంగా ఉంది.
Tags:    

Similar News