కొన్నిసార్లు అంతే. అప్పటివరకు కొన్ని పదాలకు లేని విపరీతమైన ప్రాధాన్యం కొందరి పుణ్యమా అని వచ్చేస్తుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో.. మరి ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు ‘రోడ్ మ్యాప్’ మాట ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
జనసేన ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ వారు ఇచ్చే రోడ్డు మ్యాప్ తోముందుకు వెళతామని చెప్పటం తెలిసిందే.
బీజేపీ - జనసేన మధ్య పొత్తు పొడిచి చాలా కాలమే అయ్యింది. ఈ మధ్యన రెండు పార్టీల మధ్యన సమ్ థింగ్.. సమ్ థింగ్ అన్న గుసగుసలు వినిపిస్తున్న వేళ.. తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్న విషయాన్ని తెలియజేసే క్రమంలో పవన్ నోటి నుంచి ఆ మాట వచ్చిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మరోవైపు జగన్ వైపు నుంచి చూస్తే.. పవన్ నోటి నుంచి వచ్చిన మాటతో ఆయనకు జరిగే నష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఆ దిశగా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. తెలుగు తమ్ముడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోడ్ మ్యాప్ మాటను తాజాగా పొలిటికల్ మైలేజీ కోసం వాడేస్తూ తెర మీదకు వచ్చారు.
ఇంతకీ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎవరంటారా? అదేనండి.. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే భవానీ ఉన్నారు కదా? ఆమె భర్తే శ్రీనివాస్. భార్య ఎమ్మెల్యే అయితే భర్తలు ఎంత యాక్టివ్ గా ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గట్లే శ్రీనివాస్ కూడా తాజాగా అందరి నోట నానుతున్న రోడ్ మ్యాప్ మాటను పట్టేసుకున్నారు.
జగన్ సర్కారులో ఏపీ రోడ్లు ఎంత దారుణంగా తయారయ్యాన్న విషయంపై రాష్ట్ర ప్రజలకు చక్కటి అవగాహన ఉందన్న విషయం తెలిసిందే. తెలిసిన విషయాన్ని మరింత ఎఫెక్టివ్ గా తెలియజేసే పని చేశారు. రోడ్లు ఎంత దారుణంగా మారాయన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా ఫోటోల్ని తీసి.. వాటిని గుది గుచ్చి ఒక ఇమేజ్ రూపంలో తయారు చేసి.. జగన్ సర్కారుకు భారీ పంచ్ ఇచ్చేశారు.
అందులో.. ‘బీజేపీ వారు పవన్ కల్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎప్పుడు ఇస్తారో తెలీదు కానీ ముందు వైసీపీ వారు రాష్ట్రంలో రోడ్లు వేస్తే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి’ అంటూట్వీట్ విసిరారు. సరైన టైమింగ్ తో షాకిచ్చిన శ్రీనివాస్ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.