ఏపీలో రాజకీయం మళ్లీ ఊపందుకుంది. టీడీపీకి షాక్ ఇస్తూ ఒక్కొక్కరుగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఏడాదిలోనే మేనిఫెస్టోలోని దాదాపు ప్రతి హామీని వైసీపీ ప్రభుత్వం ఆచరణలో పెట్టి చూపించింది. అలాగే మరెన్నో సంక్షేమ పథకాలతో ప్రజల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. అయితే, వైసీపీ ఏడాది పాలనా రక్షతత్వం అంటూ టీడీపీ అధినేత వైసీపీ పై విమర్శలు కురిపిస్తున్నారు.
అయితే , పార్టీ అధినేత ఒకవైపు వైసీపీ పై విమర్శలు కురిపిస్తుంటే ..అదే పార్టీ కి చెందిన కీలక నేతలు మాత్రం జగన్ పాలనకి జై కొడుతూ వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం దాదాపు సిద్ధమైంది. ఈయన బుధవారం రోజు వైసీపీ తీర్థం పుచ్చుకొనునట్టు తెలుస్తుంది. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ప్రకాశం జిల్లాలో టీడీపీ ఇప్పటికే దాదాపుగా ఖాళీ అయ్యింది అయిపోయిందని చెప్పవచ్చంటున్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిద్ధా రాఘవరావు ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన అయన ఓటమి చెందారు. ఆ తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తెలుగుదేశంలో కొనసాగితే.. రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ఆయన పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.