మొత్తానికి చంద్రబాబునాయుడు గురువారం నాడు అసలు సంగతి బయటపెట్టారు. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయనే సంకేతాలు ఇచ్చేశారు. పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు ఆయన దిశా నిర్దేశం చేశారు. త్వరలో రాబోయే మునిసిపల్ ఎన్నికలకు అన్ని రకాలుగాను సన్నద్ధం కావాలంటూ.. చంద్రబాబు పిలుపు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే మునిసిపల్ ఎన్నికలు వస్తున్నాయంటే.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయాలు సాధించడం అంత సులువు కాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నిర్దిష్టంగా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటంటే.. తాము ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం అంటూ వారు వాపోతున్నారు.
అసలే అచేతనంగా ఉన్న తమ పార్టీ సర్కారు కనీసం ప్రత్యేకహోదా విషయంలో కూడా చేసిందేమీ లేదని, పట్టణ ప్రాంత ఓటర్లలో రాజకీయ అవగాహన, ప్రభుత్వ వైఫల్యాలపై చైతన్యం కాస్త ఎక్కువగానే ఉంటుంది గనుక.. వ్యవసాయ రుణమాఫీ వంటి మాయ మాటలతో నగర ఓటర్లను నమ్మించడం కష్టం అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఒక రకంగా చూస్తే అది నిజమేననేది ప్రజల భావన. నగర ఓటర్లలో విద్యావంతుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. వారిలో ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆలోచన చర్చ ఎక్కువగా నడుస్తుంటుంది. మరి వారిని ఎలా ఇంప్రెస్ చేసి, మునిసిపోల్స్ లో నెగ్గుకొస్తారో చూడాలని జనం భావిస్తున్నారు.