టీడీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా ఉండి గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని కాపాడిన ప్రముఖ వ్యాపారవేత్తలు, టీడీపీ ఎంపీలు ఇప్పుడు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరట.. ఈ విషయంలో వారు టీడీపీ సీనియర్లతో హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించారని వార్త బయటకు రావడం కాకరేపుతోంది..
2024 వరకు టీడీపీని కాపాడాలంటే చంద్రబాబే ఉండాలన్నది వారి అభిప్రాయమట.. ఒకవేళ వృద్ధాప్యంతో చంద్రబాబు బాధ్యతలను లోకేష్ కు అప్పగిస్తే.. దీన్ని తాము అంగీకరించమని.. టీడీపీ వెంట నడిచేందుకు వారు సిద్ధంగా లేరని సమాచారం.. లోకేష్ సామర్థ్యంపై అనుమానంతోనే టీడీపీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టవద్దని వారు డిమాండ్ చేస్తున్నారట..
అందుకే తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో.. టీడీపీ ఓటమి.. 2024 వరకు రికవరీపై వారు దృష్టి సారించి టీడీపీ సీనియర్లతో చర్చలు జరిపినట్టు భోగట్టా. వారు ప్రధానంగా లోకేష్ నాయకత్వాన్ని, ఆయన అపరిపక్వతను అంగీకరించడం లేదని సమాచారం. టీడీపీలో నంబర్ 2 పొజిషన్ లో కూడా లోకేష్ ను ఇప్పుడే తీసుకురావద్దని వారు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.
2024 వరకు చంద్రబాబు ఇదే స్టామినాతో ఉంటే ఫర్వాలేదు. లేదంటే లోకేష్ రంగప్రవేశం చేసి పార్టీ బాధ్యతలు తీసుకుంటే మాత్రం తాము అండగా ఉండేది అనుమానమేనని వారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి చర్చించుకున్నారట.. ఇప్పుడు ఇలా లోకేష్ పై టీడీపీ ఆర్థిక అండదండలున్న వారు మీటింగ్ పెట్టడం టీడీపీలో చర్చనీయాంశంగా మారిందట.. దీనిపై టీడీపీ అధిష్టానంలో కూడా చర్చ జరిగినట్టు సమచారం.