ప్రస్తుతం అమరావతిలో ఈ విషయమే హల్ చల్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో తాడో పేడో తేల్చుకునేందుకు వైసీపీతో పోరాడిన టీడీపీ ఎట్టకేలకు విజయాన్నయితే సొంతం చేసుకుంది. దీంతో పార్టీ శ్రేణులన్నీ పండగ చేసుకుంటాయని అందరూ అనుకున్నారు. కానీ, దీనికి విరుద్ధంగా పార్టీ శ్రేణులు నిర్వేదంలో మునిగిపోయాయి. ఇప్పుడైతే ఏదో గెలిచాం కానీ, 2019 మాటేంటని తమలో తామే చర్చించుకుంటుండడం గమనార్హం. నిజానికి వైసీపీ వంటి బలమైన మాస్ ఇమేజ్ ఉన్న పార్టీని ఢీ కొట్టడం అంటే మాటలా? అని వారే అనుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో జరిగిన ఖర్చు - అక్కడకి వెళ్లిన మందీ మార్బలం వంటి పలు విషయాలను తలుచుకుని వారు ఈ ఫలితాలపై పెదవి విరుస్తున్నారట.
నంద్యాల గెలుపుపై మీడియా తెలుగు దేశం నేతలను స్పందించమని కోరింది. ఈ క్రమంలోనే అమరావతిలోని ఓ టీడీపీ సీనియర్ నేత స్పందిస్తూ.. "మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాలకు పెట్టాల్సినంత 'ఎఫర్ట్' పెడితేగానీ ఈ విజయం సాధ్యం కాలేదు. ఈ ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడం కోసం ఎన్ని రకాల ప్రయోగాలు చేశామో పార్టీ నాయకులుగా మాకు తెలుసు... సాధారణ ఎన్నికల్లో ఇది సాధ్యం కాదు. ఇది గమనిస్తున్న మా పార్టీ నాయకులకు సహజంగానే భవిష్యత్తు ఎన్నికలపై ఆందోళన ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి నంద్యాలలో దాదాపు పది మంది మంత్రులు - యాభై మందికి పైగా ఎమ్మెల్యేలను టీడీపీ మోహరించింది.
అదేసమయంలో అధినేత చంద్రబాబు - బాలయ్య వంటి మాస్ ఇమేజ్ ఉన్న యాక్టర్ ను కూడా రంగంలోకి దింపారు. అయితే అదే సమయంలో వైసీపీ పక్షాన చూసుకుంటే.. కేవలం జగన్ - రోజా తప్ప పెద్దగా ఎలాంటి పెద్ద నేతా ఇక్కడ ప్రచారం చేయలేదు. అంతేకాదు, టీడీపీ మాదిరిగా ప్రజలకు భారీ ఎత్తున ఎలాంటి ప్రలోభాలకూ ఒడిగట్టలేదు. అయినా కూడా భారీగా గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయంపై వైసీపీ నేతలకన్నా కూడా టీడీపీ నేతలే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
అదేవిధంగా స్థానికులను టీడీపీ భారీ ఎత్తున బెదిరించి కూడా లొంగదీసుకున్న పరిణామాలు ఎదురయ్యాయి. పట్టణంలో మూడు కిమీ మేర రోడ్డు విస్తరణ కోసం ఇళ్ళు, షాపులు తొలగించారు. వారికి ఇప్పటివరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. టీడీపీ ఓడితే ఆ పరిహారం అందదంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారం నిర్వాసితుల్లో ఆందోళన కలిగించింది. తద్వారా ఓట్లూ అనివార్యంగా అధికార పార్టీ కి పడేలా "మైండ్ గేమ్" ఆడినట్టు తెలుస్తోంది. మూడేళ్లలో నంద్యాల వైపు చూడని అధికార పార్టీ ఉపఎన్నికలు వస్తున్నాయనగానే నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టింది.
ఓడిపోతే ఆ కార్యక్రమం నిలిచిపోతుందన్న అంతర్గత ప్రచారం చేయించడం ద్వారా ఓటర్లపై తీవ్ర ప్రభావం పడేలా చేసింది. అదేవిధంగా గ్రామాల్లో అయితే, పేదలు - ముసలి వాళ్లను పింఛన్ తో బెదిరించిందని సమాచారం. టీడీపీకి ఓటు వేయకపోతే.. మీకు వచ్చే వెయ్యి రూపాయల పింఛన్ ఆపేస్తామని టీడీపీ నేతలు బెదిరించడం వల్లే.. వైసీపీకి మొగ్గు చూపినా.. చివరి నిముషంలో టీడీపీకి ఓట్లు పడినట్టు తెలుస్తోంది.
ఇక, ఇదే విషయంపై మాట్లాడుతూ.. ‘ఉపఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చలేం. ఏమాత్రం సంబంధం కూడా ఉండదు. అయితే ఒక్క నంద్యాల గెలుపుకోసం అన్ని రకాలుగా మేం చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నియోజకవర్గంలో మేం పెట్టిన ఎఫర్ట్ విశ్లేషించుకుంటే మాత్రం భవిష్యత్తు భయమేస్తోందంటూ’ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. నంద్యాల గెలుపు.. టీడీపీకి వాపేనని తేలిపోతోంది .. అంటున్నారు విశ్లేషకులు!