ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయనపై జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా కొడాలి నాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు గౌరవం ఉందని అంటూనే.. ఆ కుటుంబంపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
ముఖ్యంగా కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ నియోజకవర్గం టీడీపీ నేతల నిరసనలతో అట్టుడికింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత వెంకట కృష్ణప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు కొడాలి నానిపై నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలో కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడలో టీడీపీ చేపట్టిన తీవ్ర ఆందోళన, ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలు, తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
పెనమలూరు, కైకలూరు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జయమంగళ వెంకటరమణ, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత వెంకట కృష్ణప్రసాద్, హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు హాజరయ్యారు. గుడివాడలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశానికి వెళ్లే సమయంలోనే పోలీసులు కొందరు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నాయకులు కొంత దూరం బస్సులో, ఆ తరువాత ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి నాయకులు ఎట్టకేలకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. కొడాలి నానిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఇక కృష్ణా జిల్లాలోని వేరే ప్రాంతాల నుంచి గుడివాడ బయలుదేరిన టీడీపీ నేతలను పదుల సంఖ్యలో పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా.. ఆ పార్టీ సీనియర్ నాయకులను సైతం అరెస్టు చేశారు. దీంతో గుడివాడ పట్టణం ఒక్కసారిగా హీటెక్కింది.
రెండు రోజుల కిందట.. కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదేసమయంలో ఆ పార్టీ మహిళా నేతలపైనా కొడాలి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమకు క్షమాపణలు చెప్పాలంటూ నాని ఇంటిని టీడీపీ మహిళా నేతలు చుట్టుముట్టారు. ఈ పరిణామాల క్రమంలో తాజాగా టీడీపీ నేతలు నాని పై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గుడివాడలోని టీడీపీ కార్యాలయం వద్దకు నేతలు బయల్దేరగా పలువురు నేతలను మార్గంమధ్యలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ వర్ల రామయ్య తదితరులను పోలీసులు కృష్ణా జిల్లా పామర్రు వద్ద అరెస్టు చేసి గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మరోవైపు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పెడన పార్టీ ఇన్‌ఛార్జి కాగిత వెంకట ప్రసాద్‌లు ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించి గుడివాడ వచ్చారు. అనంతరం గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. వారిని పోలీసులు టీడీపీ కార్యాలయం వద్ద అడ్డగించారు. బారికేడ్లు, రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడే ఫిర్యాదు స్వీకరిస్తామని టీడీపీ నేతలకు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
కేసు పెట్టే హక్కును పోలీసులు ఎలా అడ్డుకుంటారని రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. అయినా టీడీపీ నాయకులను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరించడంతో ఉద్రిక్తత పెరిగింది. నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో రావి వెంకటేశ్వరరావు దుస్తులు చిరిగిపోయాయి. పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగానే వస్తామని నాయకులంతా పట్టుబట్టడంతో చేసేదిలేక పోలీసులు అనుమతిచ్చారు.
నానికి వ్యతిరేకంగా నినదిస్తూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ప్రధాన గేటును మూసేశారు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్‌కు రావడం తప్పా? అంటూ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో డీఎస్పీలు రాజీవ్‌కుమార్, విజయ్‌పాల్ తదితరులు నాయకులతో చర్చించి ఐదుగురిని లోనికి అనుమతించారు. దీంతో ఫిర్యాదును అందజేసి నేతలు వెనుదిరిగారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.