ఏపీలో తెలుగు తమ్ముళ్లు నైరాశ్యంలో కూరుకుపోయారా? రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వారిలో జోష్ లేదా? అంటే.. ఔననే సమాధానాలు వస్తున్నాయి. ఇలా ఎందుకు అంటున్నారనే విషయంపై దృష్టి సారిస్తే.. తమ అధినేత చంద్రబాబు సీఎం అయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు సరైన ప్రాతినిథ్యం రావడం లేదని వారు ఆందోళన - ఒకింత ఆవేదన కూడా చెందుతున్నారట!
గతంలో 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి - ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలతో టీడీపీ కార్యకర్తలు ప్రజల్లో క్రెడిట్ సంపాదించారు. దాంతో పార్టీ కూడా పటిష్టమైంది. అదే మైలేజ్ తో దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లో మంచి పేరును నిలుపుకుంది. అయితే ఈసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చంద్రబాబు...పార్టీ నేతలు - కార్యకర్తలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. అధినేత చంద్రబాబు నూతన రాజధాని అమరావతి ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను గానీ, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గానీ ప్రజలకు తెలిపే బాధ్యతను తమకు అప్పగించడం లేదని తెలుగుతమ్ముళ్లు తెగఫీలైపోతున్నారట. అధినేత తీరుపై అసహనంతో నైరాశ్యంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఇక గతంలోలా ఎమ్మెల్యేలు - ఎంపీలు తమకు తామే సొంతంగా కాంట్రాక్టులు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తూ... కార్యకర్తలను - ద్వితీయ శ్రేణి నాయకులను అస్సలు పట్టించుకోవడం లేదట. దీంతో వారు తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్లు సైతం నర్మగర్భంగా అంగీకరిస్తుండడం గమనార్హం. పైకి మేడిపండులా ఉన్నంత మాత్రానా పార్టీ పటిష్టం కాదని... నేతలు - కార్యకర్తలు ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే అది సాధ్యమౌతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా పార్టీకి - ప్రభుత్వానికి మధ్య ఇప్పటికైనా సమన్వయం తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడాలి.