అధికారం చేతిలోకి తీసుకొని దాదాపుగా రెండేళ్లకు దగ్గరకు వస్తున్న వేళ.. ఇప్పటివరకూ సంచలన నిర్ణయాలు తీసుకోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ మధ్యన ప్రకటించిన ఒక నిర్ణయంపై ఏపీ అధికారపక్ష నేతలు లోలోపల కుమిలిపోతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేల్లో దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలకు అయితే కొద్ది రోజులుగా నిద్ర పట్టని పరిస్థితి. దీనికి తమ అధినేత చేసిన వ్యాఖ్యలే కారణంగా చెబుతున్నారు.
రాష్ట్రంలో ఇసుక అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఇంతకాలం చూసీ చూడనట్లుగా వ్యవహరించిన చంద్రబాబు.. ఈ మధ్యన ఇసుక తవ్వకాల్ని ఉచితం చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం తెలుగు తమ్ముళ్లకు శరాఘాతంగా మారినట్లు తెలుస్తోంది. నెలకు కోట్లాది రూపాయిలు ఇసుక మీద ఆర్జిస్తున్న వారంతా అధినేత మీద లోగుట్టుగా కారాలు.. మిరియాలు నూరుతున్న పరిస్థితి. తమ నోటి దగ్గర ఇసుక తీసేశారంటూ బాబు మీద ఆక్రోశం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇసుక కారణంగా ఏపీ సర్కారుకు వచ్చిన చెడ్డ పేరు అంతాఇంతా కాదు. నిజానికి.. తాజాగా ప్రకటించిన ఉచిత ఇసుక తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాల్ని మరింత సరళం చేయాలని.. మరిన్ని మినహాయింపులు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు రావటంతోపాటు.. బాబు సర్కారు మైలేజీ పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. తన నిర్ణయంతో తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారనే చెప్పాలి.