జనసేన అధినేత తెలుగు దేశం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం.. ఆ పార్టీ నేతల్ని ఇరుకున పెట్టేలా మాట్లాడటం.. ఆపై అవతలి వైపు నుంచి ప్రతి విమర్శలు రావడం.. ఒక రోజు గడవగానే ఇరు వర్గాలూ రాజీకి వచ్చేసి.. అంతా సర్దుకున్నట్లు మాట్లాడటం.. ఇదీ రెండేళ్లుగా నడుస్తున్న కథ. ఇలా ఎన్ని సందర్భాల్లో.. ఎన్ని అంశాల్లో జరిగిందో గుర్తుండే ఉంటుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై పవన్ కళ్యాణ్ విమర్శలకు సంబంధించిన వ్యవహారం కూడా ఇలాంటి ముగింపే తీసుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ ఈ విషయమై విమర్శలు గుప్పించగానే వర్ల రామయ్య సహా తెలుగుదేశం నేతలంతా మూకుమ్మడిగా పవన్ మీద పడ్డారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. కానీ ఒక రోజు గడిచేసరికి తెలుగుదేశం నేతల స్వరం మారిపోయింది. ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న వర్ల రామయ్య మాట్లాడుతూ.. పవన్ తమ మిత్రుడని.. శ్రేయోభిలాషి అని. తాము అధికారంలోకి రావడానికి ఆయన కూడా ఓ కారణమని.. ఆయనకు టీటీడీ ఈవో నియామకం విషయమై అన్ని విషయాలూ వివరించామని.. ఆయన అర్థం చేసుకున్నారని.. ఇకపై దీని గురించి ఏమీ మాట్లాడరని సెలవిచ్చేశారు.
ఐతే గత కొన్ని నెలలుగా ఉత్తరాది-దక్షిణాది వివక్ష గురించి అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్న పవన్.. ఇప్పుడు టీడీపీ నేతలు ఏదో వివరించగానే ఒక్క రాత్రిలో స్టాండ్ మార్చేసుకున్నాడా అన్నది సందేహం. ముందు తెలుగుదేశం పార్టీని విమర్శించి.. ఆ తర్వాత సైలెంటైపోతాడని.. సమస్యల పరిష్కారానికి పవన్ చేసేదేమీ ఉండదని ఆయనపై చాలా విమర్శలే ఉన్నాయి. ఇప్పుడీ కొత్త వివాదంపై మాట్లాడిన పవన్.. ఇలాగే దాన్ని మధ్యలో వదిలేశాడంటే ఆయన క్రెడిబిలిటీ మరింత దెబ్బ తినడం ఖాయం.