ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఒక నేత. గత పర్యాయానికన్నా మునుపే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతిపక్షంలో ఉండి జగన్ కు బాగా లాయలిస్ట్ గా పని చేశారు. వరసగా రెండోసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నెగ్గారు.
ఆయనకు జగన్ కూడా చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. మరో ఆలోచన లేకుండా మంత్రి పదవి కూడా ఇచ్చేశారు. అలా ఆయన హ్యాపీ. ఆ విషయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో గతంలో పని చేసిన వ్యక్తి - తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే పేరుబడ్డ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. పాత పరిచయాలు ఆయనను వదలడం లేదు!
ఏపీ అసెంబ్లీ సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన చుట్టూ తరచూ తెలుగుదేశం ఎమ్మెల్యేలే కనిపిస్తూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది. బ్రేక్ సమయాల్లో ఆయన బయటకు వస్తే.. ఆయనను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చుట్టుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీలోని ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే ఆయనను అస్సలు వదలడం లేదట.
ఆయనతో మాట్లాడుతూ.. ఆయనకు కబుర్లు చెబుతూ కనిపిస్తున్నారట. సాధారణంగా అధికార పార్టీ వాళ్లతో - అందునా మంత్రితో ప్రతిపక్షం వాళ్లు మరీ అంత సన్నిహితంగా ఉండరు. అయితే ఆ మంత్రి చుట్టూ మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లు చుట్టుకుంటూ - అసలు మాట్లాడదామన్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదట! అందులో ఆ మంత్రి తప్పేం లేకపోయినా.. తెలుగుదేశం వాళ్లు మాత్రం ఆయనను ఇంకా తమ వాడు అన్నట్టుగా ఓన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది!