ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌... టీడీపీ హ‌డ‌ల్!

Update: 2018-10-20 07:51 GMT
గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి జ‌నం అండ విప‌రీతంగా ఉన్నా స్ట్రాట‌జీల ప‌రంగా - రాజ‌కీయ వ్యూహాల ప‌రంగా టీడీపీని అందుకోలేక‌పోవ‌డం వ‌ల్ల ఏపీలో అత్య‌ధికులు ఆద‌రించినా అధికారంలోకి రాలేక‌పోయింది. కానీ యువ‌కుడు అయిన వైసీపీ అధినేత‌ జ‌గ‌న్‌ కు అది మంచే చేసింది. తన‌ను తాను మెరుగుప‌రుచుకోవ‌డానికి అది ఓ గొప్ప అవ‌కాశంగా జ‌గ‌న్ తీసుకున్నారు. ఈసారి జ‌నం ఆద‌ర‌ణ మ‌రింత పెరిగింది. అయినా, టీడీపీ త‌న వ్యూహాల‌తో జ‌నాల‌ను మ‌భ్య పెట్ట‌కుండా వాటిని ప‌టాపంచ‌లు చేయ‌డానికి వైసీపీ స‌దా సిద్ధంగా ఉంది.

ఎన్టీఆర్ బొమ్మ లేకుండా టీడీపీ ఎన్నిక‌ల‌కు పోలేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అయితే, ఇటీవ‌ల టాలీవుడ్ లో బ‌యోపిక్‌ ల హ‌డావుడి పెర‌గ‌డంతో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ తో మ‌రిన్ని మార్కులు కొట్టేయ‌చ్చ‌ని తొలినాళ్ల‌లో ఎన్టీఆర్ చంద్ర‌బాబుపై చూపిన ప్రేమ‌ను మాత్ర‌మే హైలెట్ చేసి చంద్ర‌బాబే ఎన్టీఆర్ వార‌సుడిలా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది తెలుగుదేశం. అందుకోసం బాల‌య్య క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ జీవితాన్ని రెండు పార్టులుగా తీసే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే, చిత్రంగా ఈ పార్టుల‌న్నీ చంద్ర‌బాబు వెన్నుపోటు ఘట‌న‌కు ముందు - ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలోకి రాక‌ముందే ముగించడం ద్వారా ప్ర‌తికూల ప్ర‌భావం లేకుండా చూడాలని వ్యూహాత్మ‌కంగా సినిమా నిర్మిస్తున్నారు.

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన రాంగోపాల్ వ‌ర్మ‌... వాస్త‌వాల‌ను కెల‌క‌డంలో సిద్ధ‌హ‌స్తుల‌ని అంద‌రికీ తెలిసిందే. అందుకే టీడీపీ వాళ్లు దాచిపెట్ట‌బోయే ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య దుఃఖ ఘ‌ట్టాల‌ను ఎలివేట్ చేస్తూ సినిమా తీయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. రాంగోపాల్ వ‌ర్మ‌ను ఈ సినిమా తీయ‌కుండా ఆప‌డానికి టీడీపీ విఫ‌ల‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు వైసీపీ ఈ సినిమాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో సినిమా వేగిరంగా సాగుతోంది. బాల‌య్య ఎన్టీఆర్ సినిమా రెండో పార్టు విడుద‌ల‌తో పాటే వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల కానుంది. అంటే ఇరు ద‌ర్శ‌కులు క‌లిసి ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్క‌రిస్తున్నారు.

ఈ సినిమాకు రాకేష్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి నిల‌బ‌డాల‌ని చూస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా ఈ సినిమా పూర్తి చేసి తీరుతామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ని అతి ముఖ్య‌మైన ఘ‌ట్టం ఆయ‌న అల్లుడు చంద్ర‌బాబు విశేష ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ఎన్టీఆర్‌ ను రాజ‌కీయ‌ వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ జీవితంలో ఇదే అత్యంత ముఖ్య‌మైన ఘ‌ట‌న‌. అందుకే ఆ పాయింట్ ఆధారంగా సినిమా తీస్తే ప్ర‌పంచానికి నిజాలు తెలుస్తాయ‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

తిరుప‌తిలో జ‌రిగిన లక్ష్మీస్  ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్న ల‌క్ష్మీపార్వ‌తి పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఈ సినిమాపై మాట్లాడుతూ 22 ఏళ్ల తన పోరాటంలో అప్పటి పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి రామ్‌ గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని తీస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండ‌గా... జ‌గ‌న్ ఈసారి ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని - ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు మ‌రోసారి చంద్ర‌బాబును ఆమోదించ‌బోర‌ని అంటున్నారామె కృష్ణా - గుంటూరు జిల్లాల్లోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసే అవ‌కాశాలున్నాయి.



Tags:    

Similar News