టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నేటితో 72 ఏళ్లు పూర్తి కావడంతో తెలుగుదేశం నేతలు, క్యాడర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ టీడీపీ నేత బుద్దా వెంకన్న జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనపై ప్రేమను కాస్త ఎక్కువ చూపించారు. అదే ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేసింది. బోండా ఉమా వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి.
"ఇక్కడి నుంచి వైసీపీ అధినేత జగన్ ను హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. చంద్రబాబుకు గానీ, ఆయన కుటుంబానికి గానీ ఎవరైనా హాని తలపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. అడ్డుకొని తీరుతాం. 100 మంది ఆత్మాహుతి బ్యాచ్‌ని సిద్ధం చేశాం, చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని కాపాడుకునేందుకు చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉన్నామని' బుద్దా వెంకన్న అన్నారు.
వైసీపీ నేతలను హెచ్చరించిన బుద్దా వెంకన్న.. 'చంద్రబాబుపైనా, ఆయన ఇంటిపైనా, కార్యాలయంపైనా దాడి చేస్తే జగన్ ఏదో ఒక పదవి లేదా ప్రమోషన్ ఇస్తారని పలువురు అధికార పార్టీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు 24×7 టీడీపీ ఆత్మాహుతి బ్యాచ్ రక్షణ కల్పిస్తుందని' బుద్దా హెచ్చరించారు. కాబట్టి వైసీపీ అరాచకాల రోజులు పోతాయని అన్నారు.
"మేము షిఫ్ట్ వారీగా పని చేయబోతున్నాము. ఎవరైనా మా నాయకుడికి హాని కలిగించే ఉద్దేశం కలిగితే అప్పుడు తగిన సమాధానం ఇవ్వడంలో మేము ఆలోచించము" అని బుద్ధా వెంకన్న చెప్పారు.
బుద్ధా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో పాటు రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. ఇది తీవ్రమైన హెచ్చరికగా పేర్కొంటున్నారు. ఇలాంటివి రాజకీయాల్లో సరికాదని అన్నారు. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన బుద్దా... మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.