కోర్టులపై ఒత్తిడి తెచ్చేలా తెదేపా డైలాగులు!

Update: 2017-10-20 17:08 GMT
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. శిక్ష పడేవరకు ఆయనను దోషిగా పరిగణించడానికి వీల్లేదు. అలాగే.. విచారణకు ఆటంకం ఏర్పడకుండా.. తనకు కొన్ని మినహాయింపులు కావాలని విజ్ఞప్తి చేసుకోవడానికి జగన్ కు అన్ని రకాలుగానూ హక్కు ఉంటుంది. ఆ రకంగానే ... ఆయన తనకు పాదయాత్ర సాగినంత కాలమూ... వాయిదాలకు హాజరు కావడం నుంచి మినహాయింపు కోరుతున్నారు. వాదనలు వినడం పూర్తిచేసిన కోర్టు.. 23వ తేదీన ఏ సంగతి తేల్చనుంది.

అయితే జగన్ చాలా స్పష్టంగా తనకు మినహాయింపు ఇచ్చినంత మాత్రాన విచారణకు ఆటంకం ఉండదని, తన న్యాయవాది , వాయిదా కోరకుండా హాజరవుతారని చెబుతూనే ఉన్నారు. అయితే.. జగన్ కు అనుమతి రాదని, ఆయన నేరాలకు వచ్చే అవకాశం లేదని ఇలా.. రకరకాల డైలాగులు వర్ల రామయ్య లాంటి తెలుగుదేశం నాయకులు.. ఇండైరక్టుగా కోర్టును ప్రభావితం చేసే సాహసానికి తెగిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

వైఎస్ జగన్ తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లదచలుకున్నప్పుడెల్లా కోర్టులు అనుమతి ఇచ్చాయి. అవే కోర్టులు ప్రజలకోసం రాష్ట్రంలోనే ఉంటూ పాదయాత్ర చేస్తానంటే మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తాయి. పైగా ప్రతి శుక్రవారం కోర్టుకు రావడం నుంచి మినహాయింపు ఇచ్చినంత మాత్రాన.. కోర్టు ప్రొసీడింగ్స్ కు ఎన్నడయినా ఆయన ప్రెజన్స్ అవసరం అని భావిస్తే గనుక... ఖచ్చితంగా.. తక్షణం తర్వాతి వాయిదాకు రావాల్సిందిగా ఆయనకు సమన్లు జారీ చేయవచ్చు. అలాంటి ఆదేశాలను జగన్   అనుసరిస్తారు కూడా. మరి ఆయనకు అనుమతి ఇవ్వడంలో అభ్యంతరాలు ఉండకపోవచ్చుననేది కొందరు న్యాయనిపుణుల వాదనగా ఉంది.

అయితే జగన్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి వస్తుందని, ఆ అనుమతి రావడం కూడా అక్రమమే అన్నట్లుగా ప్రజల్లో ఓ భావనను ముందునుంచే సృష్టించాలని.. తెలుగుదేశం నాయకులు తపన పడుతున్నట్లుగా ఉంది. జగన్ కు అనుమతి వచ్చే అవకాశమే లేదు.. అంటూ పదేపదే ప్రచారం చేసిన తర్వాత , పర్మిషన్ వస్తే గనుక.. ఇలాంటి కామెంట్లు న్యాయవ్యవస్థనే తప్పుపట్టినట్లు అవుతాయి కదా అని కూడా కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం నాయకులు చాలా వ్యూహాత్మకంగా.. న్యాయమూర్తులను ప్రభావితం చేసేలా.. అనుమతి ఇస్తే వారి చేతికి మరక అంటుకుంటుందని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.
Tags:    

Similar News