ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసు పార్టీ చేస్తున్న ఆందోళనలకు బ్రేకేయడానికి... ఏపీ పీసీసీ అధ్యక్షుడి నోరు మూయించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తుగడ వేసింది... ప్రత్యేక హోదాపై, ఎపికి ఇచ్చిన హామీలపై మోసం చేశారంటూ కాంగ్రెసు పార్టీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులపై పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. అనంతపురంలో ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ ఐఆర్ నమోదు చేసి ఆ ప్రతి ఇవ్వాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. దాంతో ఆయనను అరెస్టు చేశారు.
నేపథ్యంలో రఘువీరా స్పీడుకు బ్రేకేసేందుకు టీడీపీ బుర్రకు పదును పెట్టింది.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రఘువీరా వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు జరిపిన మేఘమథనం అంశాన్ని తెరపైకి తెచ్చింది. వందల కోట్లు ఖర్చు చేసినా చుక్క చినుకు పడకపోవడంపై విమర్శలు కురిపిస్తూ దీనిపై దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించి కారకులను జైళ్లో పెట్టిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి ప్రకటించారు. మేఘమథనంలో అక్రమాలపై రఘువీరాపై ఎప్పటినుంచో ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దీంతో రఘువీరాను కట్టడి చేయడానికి టీడీపీ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ కు కౌంటర్ గా అనంతపురంలో చంద్రదండు తెర మీదికి వచ్చింది. రాష్ట్రాన్ని సోనియా అడ్డగొలుగా విభజించిందని చంద్రదండు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సాయంత్రం అనంతపురంలో చంద్ర దండు ఆధ్వర్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రఘువీరా దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, రాష్ట్రాన్ని విభజించిన సోనియా ఆమె మాటలకు వత్తాసు పలుకుతున్న రఘువీరారెడ్డి ఇక్కడి ప్రజలను మోసం చేశారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ఆందోళనలు ఆగకపోతే రాష్ట్రమంతా చంద్రదండు కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది.