రవి ప్రకాష్ ను కాపాడలేకపోతున్న టీడీపీ పెద్దలు?

Update: 2019-05-15 08:35 GMT
తెలుగుదేశం పార్టీ కోసం రవి ప్రకాష్ ఎంతో చేశాడని అంటారు. ఇది ఎవరో అనడం కాదు. జనాభిప్రాయం. ఆయన సీఈవోగా వ్యవహరించిన చానల్ తెలుగుదేశం పార్టీకి అడుగడుగునా అనుకూలంగా పని చేసింది అనేది కామన్ గా వినిపించే అభిప్రాయం. ఈ విషయంలో తెలుగుదేశం ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీచాలా సార్లు ఓపెన్ గా రియాక్ట్ అయ్యింది.

తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఆ చానల్ అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. సాధారణం గా మీడియా మీద రాజకీయనేత ఎవరూ అలా స్పందించరు. అయినా జగన్ అలా అన్నారంటే.. అది ఆ చానల్ తీరు అని అర్థం చేసుకోవాలి. ఆ చానల్ సీఈవో సీట్లో రవి ప్రకాష్ కూర్చోవడం చేతనే అలా ఆ చానల్ ప్రవర్తించిందని పరిశీలకులు అంటారు.

ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీకి రవి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆ టీవీ చానల్ ఎంతగా జాకీలు వేసిందో అందరికీ తెలిసిన సంగతే. జగన్ మీద విష ప్రచారంలో రవి ప్రకాష్ ముందుండి నడిపించాడని అంటారు. మరి తెలుగుదేశం పార్టీకి అంతగా హెల్ప్ చేసినా ఇప్పుడు రవి ప్రకాష్ కు మాత్రం తెలుగుదేశం పార్టీ ఎలాంటి హెల్ప్ చేసే పరిస్థితి లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం.

ప్రస్తుతం రవి ప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పరారీలో ఉన్నాడు. ఆయనపై నమోదు అయిన కేసులు శిక్షార్హమైనవి  అని అంటున్నారు. ఇప్పటికే రవి ప్రకాష్ కోర్టును కూడా ఎక్కారు. తనపై నమోదు అయిన కేసులు సరికాదని వాపోయాడు. అయితే  కోర్టు మాత్రం ఆ విషయంలో రవి ప్రకాష్ కు అనుకూలంగా వ్యవహరించ లేదు. రవి ప్రకాష్ పిటిషన్ ను అత్యవసర విచారణకు తీసుకోలేదు న్యాయస్థానం.

మరో వైపు అరెస్టు వారెంట్ జారీ కావడానికి సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రవి ప్రకాష్ తెలుగుదేశం పార్టీ పెద్దల సాయం అడుగగా వారు చేతులు ఎత్తేశారని సమాచారం. ఎన్నికల ఫలితాల టెన్షన్లో వాళ్లు ఉన్నారు. అధికారం చేజారితే పరిస్థితి ఏమిటనే అంశం గురించి వారు తర్జనభర్జనల్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రవి ప్రకాష్ కు వారు సాయం చేసే పరిస్థితి లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
Tags:    

Similar News