విశాఖలో టీడీపీ దుకాణం బంద్ అయినట్టేనా?

Update: 2020-09-24 02:30 GMT
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని సీఎం జగన్ పట్టుదలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ నగరంలో నలుగురు ప్రతిపక్ష టీడీపీలున్నారు. జగన్ విశాఖ రాజధాని చేయగానే వారంతా వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలాగానే వాసుపల్లి కూడా పార్టీలో చేరకుండానే మద్దతు ప్రకటించి టీడీపీకి దూరం జరిగారు. కొంతకాలంగా టీడీపీలో సైలెంట్ గా ఉన్న వాసుపల్లి తాజాగా వైసీపీకి జైకొట్టారు.ఇప్పటికే సీనియర్ మంత్రి , టీడీపీ ఎమ్మెల్యే గంటా కూడా ఇలానే టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మరో ఎమ్మెల్యే గణబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.

మొత్తంగా విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలుండగా ముగ్గురు ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గంటా, వాసుపల్లి, గణబాబులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే టాక్ ఉంది. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రం టీడీపీలోనే ఉంటానని అంటున్నారు.

ఇటీవల వాసుపల్లి ప్రమేయం లేకుండానే ఆయన విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ నుంచి విడుదలైన లేఖ వైరల్ అయ్యింది. విశాఖ ఎమ్మెల్యే వ్యతిరేకించడం ఏంటని స్థానికులంతా ప్రశ్నించడంతో వాసుపల్లి బాగా హర్ట్ అయ్యారు. అప్పటి నుంచే టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇక వాసుపల్లి తర్వాత వైసీపీలోకి గంటాతో పాటు గణబాబులు చేరుతారనే ప్రచారం మొదలైంది. కానీ గంటా రాకను వైసీపీ మంత్రి అవంతి సహా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీంతో పెండింగ్ లో పడిపోయింది. ఇప్పుడు వాసుపల్లి రాకతో మారోసారి జంపింగ్ లపై చర్చ జరుగుతోంది. మిగతా ముగ్గురు కూడా వైసీపీలో చేరుతారని టీడీపీ దుకాణం విశాఖలో ఖాళీ అయినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News