30 ఏళ్ల పోరాటం.. టీడీపీ కంచుకోట బద్దలు

Update: 2019-05-29 10:15 GMT
1972 అది. రెండు పదుల వయస్సులోనే రాజకీయం.. బీజేపీ పెద్దాయన, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి జై ఆంధ్రా ఉద్యమం.. ఆ తర్వాత ఉద్యమంలో జైలు జీవితం.. ఇలా గొప్ప చరిత్ర ఉన్నా.. ఆధునిక రాజకీయంలో మాత్రం ఆయన గెలుపు అందని ద్రాక్షగానే మారిపోయింది. కానీ 30 ఏళ్ల కల నేడు నెరవేరింది. టీడీపీ కంచుకోట బద్దలై వైసీపీ జెండా సుధీర్ఘంగా ఎగిరింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయిన మైలవరంలో బలమైన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ను ఓడించి మరోసారి ‘వసంత నాగేశ్వరరావు, కృష్ణ ప్రసాద్ లు  వెలుగులోకి వచ్చారు. నాగేశ్వరరావు  చాలా సీనియర్ రాజకీయవేత్త కానీ.. గెలుపు కోసం ఇన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

1982లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు వసంత నాగేశ్వరరావు. 1983- 1985 ఎన్నికల్లో గెలిచి హోం, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ తర్వాత నంబర్ 2 స్థానాన్ని అందుకున్నారు. 1989లో బడ్జెట్ లీక్ చేశారంటూ మంత్రులందరిని తొలగించారు ఎన్టీఆర్. దీంతో కాంగ్రెస్ లో చేరి జగ్గయ్యపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత 1999లో ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లోనూ గెలవలేకపోయారు. 2014 ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ జైలుకు వెళ్లడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రావుకు మద్దతిచ్చి గెలుపించారు.  ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా జరిగారు. టీడీపీ ఆయనను పట్టించుకోలేదు..

గత ఏడాది వైసీపీలో చేరారు వసంత కృష్ణ ప్రసాద్.  అప్పటి నుంచి మైలవరంలో శక్తివంచన లేకుండా కృషి చేశారు. టీడీపీలో బలమైన నేత అయిన దేవినేనిపై పోటీకి దిగి ఓడించి ఔరా అనిపించారు. దేవినేనిని ఓడించి నెగ్గడం మూడు దశాబ్ధాల తర్వాత వసంత నాగేశ్వరావు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రావడం ఆ కుటుంబంలో ఆనందం నింపింది.

   


Tags:    

Similar News