ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ టిక్కెట్ కన్ ఫాం కోసం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలైనట్లున్నాయి. అంతర్గతంగా జరిగాల్సిన చర్చలు రోడ్డున పడుతున్నాయి. మైనార్టీల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత సెగ మంత్రి నారాయణకు తాకింది. ఎప్పటికప్పుడు పదవుల ఆశ చూపుతూ వస్తున్న చంద్రబాబు, చివరి క్షణంలో ప్లేటు ఫిరాయించడం ముస్లిం మైనార్టీలకు నచ్చడం లేదు. బహిరంగ సమావేశం పెట్టి ఇన్నాళ్లు పనిచేసినందుకు ఇదేనా ఇచ్చే గౌరవం అంటూ దుమ్ముదులిపేశారు.
ఆంధ్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ప్రత్యేకమైంది. ఇక్కడ వైసీపీ ఓటింగ్ ఎక్కువ. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మేయర్ గా వైసీపీ తరుపున ఎన్నికైన అజీజ్ - కొన్ని కారణాల వల్ల టీడీపీలో చేరిపోయారు. టీడీపీ మేయర్ గా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయించే సమయంలో ఎమ్మెల్మీ ఇస్తామని హామీ ఇచ్చారట. ఆ హమీ ఇప్పటి వరకు జరగలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఒకానొక దశలో టీడీపీలో మైనార్టీలకు న్యాయం జరగడం లేదని, తన అనునాయుల వద్ద చెప్పుకొని బాధపడ్డారట. ఆయన చల్లార్చేందుకు నెల్లూరు సీటు ఇస్తామని మరలా ఆశ చూపారట.
నెల్లూరు సిటీ తనకు ఖాయమని ధీమాలో ఉన్న అజీజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు మరలా షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా - ఎటువంటి రాజకీయ అనుభం లేకపోయినా ఎమ్మెల్సీగా ఎన్నికైన మంత్రి నారాయణ ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారట. నెల్లూరు సిటీకి ఆయన పోటీ చేసేలా చంద్రబాబును ఒప్పించారు. ఇది తెలుసుకున్న అజీజ్ వర్గంలో అసహనం ఎక్కువైపోయింది. మ్యాటర్ సెటిల్ చేసుకుందామని నారాయణ ఆహ్వానాలు పలుకుతున్నా - పెడచెవని పెట్టి బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణను, టీడీపీ అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మైనార్టీలకు చేసిన అన్యాయం ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమతం కాదని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తగిన శాస్తి అనుభవించక తప్పదని తిట్ల దండకం వినిపించారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. వైసీపీలో మంచి పట్టున్న ఎమ్మెల్యే అనిల్ కు నియోజకవర్గంలో అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో మొదలైన ‘నారాయణ’ లుకలుకలు ఏ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా మరలా ఇక్కడ వైసీపీ గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.