ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ఎదురైన ఈ అనుభవం బాబుకు షాకింగ్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.
ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాల్ని సమర్పించేందుకు కటుంబ సభ్యులతో సహా తిరుమలకు వెళ్లారు. ముఖ్యమంత్రిస్థాయి నేత తమ జిల్లాకు వచ్చిన వేళ.. మర్యాదపూర్వకంగా పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తుంటారు. అందునా చుట్టుపక్కల నియోజకవర్గాల వారు మరింత పక్కాగా హాజరవుతుంటారు. అలాంటిది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తే.. సదరు ఎమ్మెల్యే వెళ్లకుండా ఉంటారా?
తాజా ఎపిసోడ్ లో మాత్రం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాత్రం వెళ్లకుండా ఉన్నారు. దీంతో.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు రాలేదన్న విషయాన్ని ఆరా తీశారు చంద్రబాబు. ఆమె ఎందుకు రాలేదు? అసలేం జరిగింది? ఆమె అసంతృప్తికి కారణం ఏమిటి? అన్న విషయాల్ని ప్రశ్నించటమేకాదు.. ఆ విషయాల మీద క్లారిటీ తీసుకోవాలంటూ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని కోరారు.
కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన బాబును ఎమ్మెల్యే సుగుణమ్మ కలవకపోవటానికి కారణం ఇటీవల ఆమె పట్ల టీటీడీ అధికారుల వ్యవహారశైలేనని చెబుతున్నారు. శ్రీవారి మహాసంప్రోక్షణ సమయంలో ఎమ్మెల్యే హోదాలో సుగుణమ్మ తిరుమలకు వచ్చారు. అయితే.. టీటీడీ అధికారులు మాత్రం మహాసంప్రోక్షణలో ఆమె పొల్గొనటానికి వీల్లేదని రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఆమె. ఈ విషయంలో బాబు స్పందన ఏ మాత్రం లేకపోవటంపై ఆమె కినుకుగా ఉన్నారు.
దీని పర్యవసానమే.. ఆమె గైర్హాజరీగా చెబుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకు అధికారుల కారణంగా అవమానం ఎదురైతే.. ఆ విషయాన్ని వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి.. నాన్చిన బాబు తీరుతో సుగుణమ్మ హర్ట్ అయ్యారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. తన తీరు కారణంగానే బాబుకు షాక్ తగిలిందని చెప్పక తప్పదు.