తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుండడం రామ్ గోపాల్ వర్మకు అలవాటుగా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడు - మాజీ సీఎం నందమూరి తారక రామారావుపై బయోపిక్ తీయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించి వర్మ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా, తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆ బయోపిక్ ను తీయబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. దీంతో, ఆ సినిమా మొత్తం లక్ష్మీ పార్వతికి - ఎన్టీఆర్ కు మధ్య ఉన్న అనుబంధం - వారి పెళ్లి - ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టడం వంటి విషయాలపై ఉండవచ్చని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఓ రకంగా ఈ సినిమాలో వర్మ...చంద్రబాబును విలన్ గా చూపించే అవకాశముందని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వర్మపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిప్పులు చెరిగారు.
ఎన్టీఆర్ పై బయోపిక్ తీయబోయే ముందు వర్మ....సీఎం చంద్రబాబు అనుమతి తీసుకోవాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.అదే విధంగా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా డైలాగ్ టు డైలాగ్ - సినిమా మొత్తం చంద్రబాబుకు చూపించాలని చెప్పారు. ఒకవేళ వర్మ తమ మాటలను పెడ చెవిన పెట్టిన పక్షంలో తాము ఊరుకోబోమని హెచ్చరించారు. ఆ బయోపిక్ లో వివాదాస్పద అంశాలను చూపిస్తే వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. వర్మ సినిమాలు అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని - సినిమా ప్రారంభానికి ముందు ఏదో ఒక వివాదం రేపడం - కొన్నాళ్ల తర్వాత ఆ వివాదం గురించి మరిచిపోవడం వర్మకు సర్వ సాధారణమేనన్నారు.
కొద్ది రోజు క్రితం ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో పాటు జై ఎన్టీఆర్....జై ఎన్టీఆర్ అంటూ....ఏకంగా ఓ పాటను కూడా విడుదల చేశాడు. ఎన్టీఆర్ తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ సినిమాకు వర్మ దర్శకుడా? కాదా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఆ తర్వాత కొంతకాలం వరకు ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆ ఇద్దరు ఎటువంటి ప్రకటన చేయలేదు. వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే వివాదాస్పదం అవుతుంది కాబట్టి బాలకృష్ణ వేరే దర్శకుడి కోసం వెతుకుతున్నారని వార్తలు వచ్చాయి. అందువల్లే, వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడని వినికిడి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న తీరున వర్మ వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి ల మధ్య గత అనుబంధం గురించి సినిమా తీయడం బాలకృష్ణకు ఇష్టం లేదు. దీంతో, బాలకృష్ణ తీయాలనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కు తననే దర్శకుడిగా నియిమించుకునేలా చేసేందుకే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. మరి వర్మ ప్రకటనపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.