ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ వాదన చూస్తుంటే...సొంత పార్టీ అభిమానులు నవ్వుకుంటున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ రథసారథి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా - ఆయన తనయుడు టీడీపీ యువనేత నారా లోకేశ్ చేస్తున్న కామెడీలకు అదే పార్టీకి చెందిన సీనియర్ నేతలు తోడవుతున్నారని అంటున్నారు. ఇటు చంద్రబాబు అటు ఆయన తనయుడు నారా లోకేష్ చేస్తున్న కామెంట్లపైనే సెటైర్లు...విమర్శలు వచ్చినప్పటికీ...పార్టీలో సీనియర్ నాయకులు సైతం అదే దారిన నడవడం ఈ ఆశ్చర్యానికి కారణం.
ఇంతకీ తెలుగుదేశం నేతలు సైతం ఆశ్చర్యపోయే ఆ సంఘటన వివరాలేమంటే...దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని అనే పేరున్న చంద్రబాబు కొద్దికాలం క్రితం చిత్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ``ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ నా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ...ఆయన నడిచే రోడ్డు నేను వేసిందే`` అంటూ వ్యాఖ్యానించారు. కొద్దికాలం తర్వాత ఆయన తనయుడైన మంత్రి లోకేష్ సైతం మాట్లాడుతూ ``విపక్ష నేత వైఎస్ జగన్ తో పాటుగా జనసేన నేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర - బస్సుయాత్ర చేస్తున్న సమయంలో వారు ప్రయాణించేది మేం వేసిన రోడ్లపైనే అనే విషయం మర్చిపోయారా?`` అంటూ విమర్శలు చేశారు. దీనిపై జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ``సీఎం చంద్రబాబు - ఆయన తనయుడు లోకేష్ మా రోడ్లపై నడుస్తున్నారనటం ఏంటి? ఆ రోడ్లకోసం పెట్టిన డబ్బులేమైనా వాళ్ల సొంత కంపెనీ అయిన హెరిటేజ్ నిధుల నుంచి రోడ్లేశారా? ప‌్రభుత్వ నిధుల నుంచే కదా వాళ్లు రోడ్లు వేశారు. అలా చేయడం ప్రభుత్వం బాధ్యత. ఏ సర్కారు ఉన్నా ఇదే చేస్తుంది. అయినా టీడీపీ ఇలా ప్రచారం చేసుకోవడం ఏంటి?`` అంటూ విమర్శలు చేశారు.
వైసీపీ - జనసేన నేతలకు తోడుగా నెటిజన్లు - వివిధ పార్టీల నేతలు ఇలాగే స్పందించిప్పటికీ టీడీపీ నేతల చిత్రాలు ఆగడం లేదు. తాజాగా గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గుంటూరు జిల్లా బూత్ కన్వీనర్ శిక్షణా తరగతుల సమావేశంలో ఎమ్మెల్సీ వీవీ చౌదరి ఇంతకుమించి కామెడీ చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల తర్వాత నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 29 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా కనికరించలేదని - ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అందులోనూ పూర్తిస్థాయిలో ఆదుకోకుండా.. అరకొర నిధులిచ్చి మోసం చేశారని వీవీ చౌదరి మండిపడ్డారు. నరేంద్రమోడీ వెంకన్న సాక్షిగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ తన పాదయాత్రలో నడిచే రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం వేసిందేనన్నారు. జగన్ త్రాగే నీరు ఎన్ టీఆర్ జలసిరితో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్నవేనన్నారు. పాదయాత్రలో జగన్ చూసే ప్రతి బిల్డింగ్ చంద్రబాబు నాయుడు అధ్యర్వంలో కట్టించిన ఎన్టీఆర్ గృహాలేనని వీవీ చౌదరి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.