స్వర్ణ ప్యాలెస్ ఇష్యూలో హీరో రామ్ ట్వీట్లు చేయడం.. ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడ సీపీ అయితే హీరో రామ్ కు ఆధారాలుంటే చూపించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామంటూ సవాల్ చేయడం హీట్ పెంచింది. హీరో రామ్ ను బెదిరిస్తున్నారని చంద్రబాబు దీనిని ఖండించారు.
తాజాగా ఈ ఇష్యూ రెండు బలమైన సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తాజాగా దీనిపై స్పందిస్తూ హీరో రామ్ కు మద్దతు పలికారు. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రియల్ లైఫ్ హీరో అనిపించాలంటూ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ రమేశ్ ను కూడా తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి నిరూపించుకోవాలని కోరారు.
హీరో రామ్ కు నోటీసులిస్తామన్న సీపీ వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఖండించారు. రాక్షసుల పాలనలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా? అని మండిపడ్డారు. విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేమూ చూస్తాం అని సవాల్ చేశారు.
ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ వివాదంపై స్పందిస్తూ సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా..? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్ ని చెప్పమనండి’ అంటూ వంశీ తనదైన శైలిలో టాలీవుడ్ హీరోకు ప్రశ్నల వర్షం కురిపించారు.చంద్రబాబు కూడా ఇదే కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కమ్మవారికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపిందా అని ప్రశ్నించారు.
ఏపీ రాజకీయాల్లో అనవసరంగా స్పందించిన హీరో రామ్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయనను విజయవాడకు రమ్మంటూ టీడీపీ మద్దతిస్తుండగా.. ఆయన రాకను వ్యతిరేకిస్తూ గమ్మున ఉండాలని వైసీపీ హెచ్చరిస్తోంది. దీంతో ఈ విషయంలో హీరో రామ్ ముందుకెళుతాడా లేదా అన్నది చూడాలి.