పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొన్న నిర్ణయంపై ఊహించని సలహా ఎదురైంది. తనదైన శైలి చేష్టలతో ప్రత్యేకతను చాటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పి.శివప్రసాద్ తాజాగా మోడీకి ఊహించని సలహా ఇచ్చారు. అయిదు వందలు - వెయ్యి రూపాయల నోట్ల రద్దుతో గ్రామాలలో - పట్టణాలలో అన్ని వర్గాల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఇప్పటికైనా ప్రధాని మోడీ పరిగణనలోకి తీసుకొని తక్షణ పరిష్కారాలను కనుగొనాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజా పునాది లేని, ప్రజలతో మమేకం కాకుండా దొడ్డిదారిన చట్టసభలకు ఎన్నికైన నాయకుల సలహాలతో ప్రభుత్వాన్ని నడపాలనుకొంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రభుత్వంలో కీలక పదవులను అనుభవిస్తున్న రాజ్యసభ సభ్యులపై పరోక్షంగా విమర్శలు కురిపించారు.ప్రజాస్వామ్యబద్ధంగా - ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ప్రధాని అయినా ప్రజల ద్వారా ఎన్నికైన నాయకుల సలహాలు - సూచనల ప్రకారమే నడుచుకోవాలని కూడా శివప్రసాద్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో క్షేత్రస్థాయిలో ప్రజలకెదురౌతున్న ఇబ్బందులేవీ ప్రభుత్వ దృష్టికి రాకుండా ఇలాంటి నేతలే అడ్డుపడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.
పెద్ద నోట్ల రద్దు నల్లకుబేరులకే తోడ్పడుతోందని, కరెన్సీ కష్టాలతో కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని శివప్రసాద్ దుయ్యబట్టారు. స్వతహాగా కళాకారుడైన శివప్రసాద్ నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల కష్టాలను ప్రతిబింబించేలా వినూత్న వేషధారణతో పార్లమెంట్ కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. సగం నల్లరంగు వస్త్రంతో మరో సగం సగం తెలుపు రంగు వస్త్రంతో కుట్టిన దుస్తులు ధరించి లోక్ సభలో ప్రవేశించిన ఆయన నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్న సభా మధ్యలోకి చేరుకొని ముందు వరుసలలో ఆశీనులై ఉన్న వారందరికీ అభివాదం చేస్తూ కలియదిరిగారు. ఆయన ధరించిన దుస్తులపై ఒకవైపు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోగలుగుతున్న బడా వ్యాపారులు - నల్లకుబేరులు వికటాట్టహాసం చేస్తున్న చిత్రాలను - మరోవైపు చిల్లర కష్టాలతో తిండికి అలమటిస్తున్న పేద,మధ్యతరగతి ప్రజల చిత్రాలు ముద్రించి ఉండడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాకముందే విజయ్‌చౌక్‌లో ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ ప్రసంగించిన శివప్రసాద్ ఆ తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి ఆ తర్వాత అదే దుస్తులతో లోక్ సభలో ప్రవేశించారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తెలుగు దేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించిన నేపధ్యంలో అదే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తూర్పారబడుతూ లోక్ సభ స్పీకర్ పోడియం వద్ద విచిత్ర వేషధారణతో నిరసన తెలియజేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. పెద్దనోట్ల రద్దు ప్రధాని మోడీ తీసుకొన్న అతి పెద్ద తప్పుడు నిర్ణయమని పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన శివప్రసాద్ విరుచుకుపడ్డారు. ఇది ఎంతమాత్రం స్వాగతించాల్సిన నిర్ణయం కాదని, పెద్దనోట్ల రద్దు నల్లకుబేరులంతా తమ అక్రమ సంపాదనను చట్టబద్ధం చేసుకోవడానికే తోడ్పడుతోందని, కోట్లాది మంది పేదలను వీధుల్లోకి తీసుకొచ్చిందని టీడీపీ ఎంపీ ధ్వజమెత్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/