నంద్యాల ఉపఎన్నికలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో దూకుడుగా వెళ్లిన ఆ పార్టీ చేసిన చిన్న తప్పు ఇప్పుడు ముప్పుగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకుని పరువు నిలుపుకోవాలనే తాపత్రయంలో అధికార పార్టీ ఎన్నికల నియమావళిని పట్టించుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో స్టార్ క్యాంపైనర్లను తీసుకొచ్చి భూమా బ్రహ్మానందరెడ్డి కోసం ప్రచారం చేయించారు. సాధారణ ఎన్నికలను తలదన్నేలా నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సాగింది. తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికను మించి నంద్యాలలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు - పలువురు మంత్రులు నంద్యాలలోనే రోజుల తరబడి మకాం వేసి తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ విషయంలో టీడీపీ నిర్లక్ష్య ధోరణి ఆ పార్టీకి శాపంగా మారింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చును అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఖర్చు కిందే లెక్కయనుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్ఠంగా రూ.28 లక్షలు ఖర్చుపెట్టవచ్చు. అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారి ప్రచారానికి అయ్యే ఖర్చుకు - అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, అభ్యర్థి తరఫున ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్ కు అందించాలి.
నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోగా తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారన్న వివరాలను తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి అందించలేదు. నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల తర్వాత ప్రచారానికి వెళ్లే స్టార్ క్యాంపెయినర్ల వివరాలను టీడీపీ ఈసీకి పంపింది. దీంతో ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులను భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఎన్నికల సంఘం జమ చేయనుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.28 లక్షలు దాటిన పక్షంలో టీడీపీకీ ఇబ్బందికర పరిస్థితే. ఒక వేళ నంద్యాలలో ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది.