ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ అమరావతి రైతుల మహా పాదయాత్ర.. ఎయిడెడ్ కళాశాలల అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా ఒకదానివెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకుంటూ పోతూ రాజకీయాలను హాట్ హాట్ గా మారుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నాయకుల పర్యటనలు జోరందుకున్నాయి. ఆ క్రమంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి. ‘‘మా నాన్నలా నేను సాఫ్ట్ కాదంటూ’’లోకేశ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. తండ్రి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని కొందరు అదే పనిగా ప్రస్తావిస్తున్నారు.
ఇంతకూ ఏమిటీ సంగతి?
టీడీపీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారంటూ లోకేశ్ కుప్పం పర్యటనలో ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాక ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందంటూ విమర్శించారు. అసలు పోలీసులు లేకుండా అధికార వైసీసీ నేతలు తిరగగలరా? అంటూ ప్రశ్నించారు.
ఇలాగైతే ప్రజా ఉద్యమం తప్పదని.. సీఎం జగన్ అందులో కొట్టుకుపోతారని హెచ్చరించారు. తన తండ్రి కొంచెం మెతకవారని, తాను మాత్రం అలా కాదని అన్నారు. అయితే, స్థానిక పరిస్థితులు, కార్యకర్తల ఇబ్బందులను చూసి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేసినా.. కొందరు అందులోని లోతైన అర్థాన్ని వెదుకుతున్నారు.
జగన్ లా దూకుడుగా వెళ్లాలనా?
తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చిన జగన్.. వైఎస్ మరణానంతర పరిణామాల్లో పెద్ద నేతగా ఎదిగారు. కేవలం పదేళ్ల రాజకీయంతోనే ఏపీ సీఎం అయ్యారు. ఈ ప్రస్థానంలో జగన్ కు కలిసివచ్చింది వ్యక్తులు కాదు. మొండితనం, దూకుడు. ఇవే ప్రజల్లో ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి. వ్యక్తులైనా, నాయకులైనా.. డైనమిక్ గా, డాషింగ్ గా ఉంటే ఎక్కువమంది అభిమానం చూరగొంటారు. జగన్ ఇలానే అభిమానం సంపాదించుకున్నారు. అయితే, ఇన్నాళ్లూ
తండ్రి చాటు బిడ్డగా ఉన్న లోకేశ్ ఈ విషయంలో ఇంకా ముందుకు నడవాల్సి ఉంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో, గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినా.. ప్రజల్లో ఆదరణ పరంగా లోకేశ్ తన ప్రత్యేకత చాటుకోవాల్సి ఉంది. అధికారంలో ఉన్నప్పడు ఇందుకు పెద్దగా వీలుండదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాత్రం ఎంత బాగా కష్టపడితే ప్రజల్లో అంత పేరు తెచ్చుకోవచ్చు. అయితే, ఇటీవల లోకేశ్ కొంత ఈ దిశగానే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో అత్యాచార బాధితురాలి పరామర్శ నుంచి అనంతపురంలో ఎయిడెడ్ కళాశాలల అంశం వరకు టీడీపీ యువనేత చురుగ్గానే స్పందించారు.
తాను మారెను.. నడత మారెను..
తెలుగు రాదంటూ, తప్పులు మాట్లాడతారంటూ గత ఎన్నికల సమయంలో లోకేశ్ పై వచ్చిన విమర్శలు, సాగిన ట్రోలింగ్ అంతాఇంత కాదు. చివరకు ఆయన వ్యక్తిగత అంశమైన శరీరం విషయంలోనూ కొందరు అదుపుతప్పి మాట్లాడారు. వీటన్నటినీ భరించిన లోకేశ్.. కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
తెలుగు నేర్చుకోవడంతో పాటు బరువూ తగ్గారు. ఇప్పడు బహిరంగ సమావేశాలే కానీ, కార్యకర్తల భేటీలే కానీ, పర్యటనలే కానీ.. ఎక్కడైనా తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. తనదైన శైలిలో పంచ్ లు విసురుతూ వర్తమాన రాజకీయాలపై ప్రజల్లో చర్చ రేకెతిస్తున్నారు.
చర్యకు ప్రతి చర్యకు తప్పదనేలా..
ఏపీలో అధికార వైసీపీ దూకుడు అందరికీ తెలిసిందే. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు.. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజా సంబంధ విషయాల్లో వైసీపీ సర్కారు దుందుడుకు గా వ్యవహరిస్తుంటుంది. మంత్రులు, ఆ పార్టీ నాయకుల నోటికైతే అదుపు ఉండదు. ఇక నిర్బంధాల విషయంలోనైతే గత టీడీపీ ప్రభుత్వానికంటే ఒక ఆకు ఎక్కువే చదివింది. ఇది వారికి మేలు చేస్తుందా? కీడు తలపెడుతుందా? అనే విషయం పక్కనబెడితే.. ప్రజలు, ప్రత్యర్థుల్లో మాత్రం ఒక విధమైన అభిప్రాయం కలగజేస్తుంటుంది.
మరోవైపు కొంత సంప్రదాయం పద్ధతిలో వెళ్లే టీడీపీకి వైసీపీ దూకుడు మింగుడుపడని అంశం. అయితే, లోకేశ్ మాత్రం కాస్త దీటుగానే వెళ్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని.. ఇప్పడు వైసీపీ చేసిన దానికి ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. మాటకు మాట, చర్యకు చర్య తప్పదని సంకేతాలు పంపిస్తున్నారు. అదే దూకుడులో లోకేశ్.. ‘‘నేను మా నాన్నలా సాఫ్ట్ కాదు’’ అని చెప్పుకొంటున్నారు. అసలు ఏపీ రాజకీయాలు అంటేనే ప్రతీకార రాజకీయాలు అన్న పేరుంది. మరి తాజా పరిణామాలు మున్ముందు ఎక్కడకు దారితీస్తాయో చూద్దాం మరి..?