దేశానికి విశ్లేషకులు కావలెను

Update: 2019-01-19 08:54 GMT
తెలుగుదేశం పార్టీ విశ్లేషకుల కొరతతో సతమతమవుతోంది. పార్టీలో ఏ అంశంపైన అయినా మాట్లాడగలిగేవారు లేకుండా పోయారు. వివిధ చానళ్లలో జరుగుతున్న చర్చలను చూస్తే తెలుగుదేశం పార్టీకి విశ్లేషకుల కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ అంశంపైన అయినా లెక్కలు - ఉదాహరణలతో సహా చెప్పగలిగేవారు కనీసం ఇరవై మంది ఉండేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక అంశాన్ని విశ్లేషించడానికి కూడా నాయకులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ సమయం తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైంది. వివిధ అంశాలపై తెలుగు ఛానల్ లో జరుగుతున్న చర్చల్లో పాల్గొనేందుకు సత్తా ఉన్న నాయకులు ఎవరు లేకపోవడం కనిపిస్తోంది.

గతంలో ఈ ఛానల్ లో లేవు.. చర్చలు లేవు. దాంతో ఏ పార్టీ నాయకులైన విలేకరుల సమావేశంలో మాట్లాడితే సరిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అనేక ఛానల్ వచ్చాయి. ప్రతి అంశం మీద గంటల కొద్ది చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి సమర్థవంతంగా మాట్లాడే నాయకులు కరువయ్యారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులలో చాలామందికి విషయ పరిజ్ఞానం ఉంది. వారంతా తమ వాదనను స్పష్టంగా - చూస్తున్న వారు అంగీకరించేలా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి స్నేహ హస్తం ఇవ్వడంతో ముందు ముందు వివిధ చానళ్లలో జరిగే చర్చ లకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా హాజరవుతున్నారు. దీంతో ఛానల్ లో జరుగుతున్న చర్చలలో తెలుగుదేశం పార్టీ అంత ప్రభావం చూపలేక పోతోంది. ఈ విషయాన్ని చర్చలు చూస్తున్నవారు గమనిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ తమ వాదనలు వినిపించే స్థాయి నుంచి కిందకు పడిపోతుంది. ఒకరిద్దరు మాత్రమే విశ్లేషకులుగా రానిస్తున్నారు. గతంలో ఎర్రంనాయుడు - వడ్డె శోభనాదీశ్వర రావు వంటి నాయకులు సమర్దవంతంగా మాట్లాడేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అలాంటి నాయకులు లేకుండా పోయారు. దీంతో తెలుగుదేశం పార్టీకి తమ వాదనలను వివిధ ఛానాల్స్ లో వినిపించే అవకాశం రావడం లేదు. భవిష్యత్తులో ఎన్నికలు ఉన్న ద్రుష్ట్య తమ పార్టీ విధివిధానాలను సమర్దవంతంగా ప్రజలలోకి తీసుకుని వెళ్లేందుకు తగిన విశ్లేషకులు కావాలని తెలుగుదేశం పార్టీ వెతుకుతోంది. ప్రస్తుతం వర్ల రామయ్య - బాబు రాజేంద్ర ప్రసాద్ - ముళ్లపూడి రేణుక - బోండ ఉమ వంటి నాయకులు చర్చలలో పాల్గోంటున్నారు. అయితే వీరు పటిష్టమైన వాదన కంటే అరుపులకు - కేకలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి వారైతే హెచ్చరించే ధోరణిలో రా - చూసుకుందాం వంటి మాటలను ప్రయోగింస్తున్నారు. ఇవి తెలుగుదేశం పార్టీకి చెటు తెస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Full View


Tags:    

Similar News