ఏపీకి 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదించుకునేందుకు వైసీపీ రెడీ అయ్యింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదిక ఇవ్వడం.. దానిపై హైపవర్ కమిటీ కూడా నిగ్గుతేల్చడంతో సోమవారం అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదనపై వైసీపీ సర్కారు బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దానికి ముందు కేబినెట్ సమావేశంలో బిల్లును ఆమోదించనుంది.
మూడు రాజధానులపై బిల్లు అసెంబ్లీలో ఆమోదం చెందితే ఇక అంతే సంగతులు కావడంతో ప్రతిపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలకు రెడీ అవుతోంది. ఎలాగైనా సరే ఈ బిల్లును అడ్డుకోవాలని రివర్స్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
శాసనసభలో 151మంది ఎమ్మెల్యేలు ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం ఈజీనే.. కానీ మండలిలో వైసీపీకి అంత బలం లేదు. మండలిలో మెజార్టీ ఉన్న టీడీపీ అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు రెడీ అయ్యిందట.. ప్రైవేటు బిల్లును తేవాలని చూస్తోందట.. సీఆర్డీఏ చట్టం విషయంలో ప్రభుత్వం తీరు టీడీపీ తన ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోందట..
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దీనిపై విప్ కూడా జారీ చేసింది. పార్టీ ఫిరాయించి వైసీపీకి సపోర్టు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ లకు టీడీపీ విప్ జారీ చేసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తే వేటు వేయడానికి టీడీపీకి వీలు చిక్కుతుంది. అనర్హతకు మార్గం సుగమం అవుతుందని టీడీపీ భావిస్తోంది.