సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి మరో పంచ్!

Update: 2019-08-22 11:34 GMT
చంద్రబాబు నాయుడు అధికారిక ట్విటర్ ఖాతా నుంచి పోస్టు చేసిన ట్వీటునే డిలీట్ చేసుకున్నారు. అది జగన్ మీద బురదజల్లే ప్రయత్నంగా నిలిచింది. ఎప్పుడో తెలంగాణలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేసి చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఆ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ మొదలుకాగానే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత లోకేష్ బాబు బోటు ట్వీటు లాజిక్ లేక నవ్వుల పాలైంది. ఒక చిన్న నాటుపడవను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంటి వైపుకు వరదను మళ్లించే ప్రయత్నం జరిగిందని లోకేష్ ట్వీట్ వేయడం కామెడీగా నిలిచింది. అలా ట్విటర్లోనే రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడి తనయుడికి ఎదురుదెబ్బ తగిలింది.

ఇక అవన్నీ చాలవన్నట్టుగా వరదల నేపథ్యంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం తయారు చేయించిన ఒక వీడియో మరింత అభాసుపాలైంది. ఆ వీడియోలో ఒక జూనియర్ ఆర్టిస్టును రైతుగా చూపుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ మాట్లాడించారు.

అయితే సదరు జూనియర్ ఆర్టిస్ట్ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ యాడ్స్ లో కూడా కనిపించిన విషయాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కనిపెట్టేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడింది. రైతుల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను బరిలోకి దించడం ఒక కామెడీ అయితే , మరోవైపు మంత్రిని ఉద్దేశించి కులవృత్తి పేరుతో దూషించడం మరో వివాదంగా మారింది.

అందుకు సంబంధించి పోలిస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. రాజకీయ విమర్శలు చేయవచ్చు. అయితే కులాల పేరుతో దూషణలు ఏమాత్రం సమర్థనీయం కాదు. అలాంటి పనులను తెలుగుదేశం చేస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ట్విటర్ లో జనాలు  దొరికిపోయారు. నవ్వులపాలయ్యారు. అది చాలదన్నట్టుగా తెలుగుదేశం సోషల్ మీడియా టీమ్ కుల వివాదాన్నే రేపింది!
Tags:    

Similar News