ఎన్నికల్లోనే చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడింది. కొన్ని జిల్లాల్లో టీడీపీ కనీసం ఖాతా తెరవలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలా ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయిన జిల్లాల్లో ఒకటి కడప. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇటీవలి ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ సీటును కూడా నెగ్గలేకపోయింది.
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తరఫున నెగ్గింది ఆయన ఒక్కరు మాత్రమే. చిత్తూరులో చంద్రబాబు నాయుడు తప్ప.. కనీసం టీడీపీ తరఫున మరెవరూ నెగ్గలేకపోయారు. అదే కడప జిల్లా విషయానికి వస్తే.. అక్కడ తెలుగుదేశం పార్టీ కి మళ్లీ అదే పరిస్థితే పట్టింది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే నెగ్గలేకపోయిన టీడీపీ కడపలో ఏం గెలుస్తుంది? అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఇక ఎన్నికల తర్వాతి సంగతికి వస్తే.. టీడీపీ ఆ జిల్లాలో మరింతగా ఖాళీ అవుతూ ఉన్నవైనాన్ని గమనించవచ్చు. ఇప్పటికే కడప జిల్లాలో ఒక్కొక్కరుగా నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎన్నికల ముందు కొందరు వెళ్లిపోయారు, ఉన్న వాళ్లంతా ఎన్నికల్లో ఓడారు. ఇంకా మిగిలిన వాళ్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు వాళ్లు జంపింగులు మొదలుపెట్టారు.
ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరారు. ఈయనకు చంద్రబాబు నాయుడు చాలానే చేశారు. తన అనైతిక రాజకీయంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈయనకు మంత్రి పదవిని కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆదికి చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఏమీ లేదు.
కేసుల భయం ఉంది. అవినీతి చేసి వాటాలు పంచుకున్నట్టుగా ఈయన ఓపెన్ గానే చెప్పుకున్నారు కూడా. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు కేసుల భయం ఉండటంలో వింత ఏమీ లేదు. వైసీపీ ఈయనను చేర్చుకోదు. కాబట్టి బీజేపీలోకి చేరేశారు.
ఆది మాత్రమే కాదు.. మరి కొందరు కూడా ఇప్పటికే చేరిపోయారు. ఇంకొందరు చేరిపోయేలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఒకరిద్దరు ఇప్పటికే బీజేపీలోకి చేరారు. ఇక రామసుబ్బారెడ్డి కూడా రేపోమాపో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవచ్చనే ప్రచారం సాగుతూ ఉంది. అది కూడా పూర్తి అయితే.. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే స్థితికి చేరుకున్నట్టే.
టీడీపీకి ఎమ్మెల్యేలు లేని జిల్లాలే కొన్ని ఉన్నాయి. కడప జిల్లాలో మాత్రం వచ్చే ఎన్నికల నాటికి పోటీకి కూడా నేతలైనా దొరుకుతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయాల ఫలితం కడపలో టీడీపీని మరింత దారుణ స్థితికి చేరుతోందని.. విశ్లేషకులు, స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.