వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పరిషత్ ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన సొంత నియోజవకర్గం గుంటూరు జిల్లాలోని మంగళగిరి పరిధిలో జరిగిన పరిషత్ పోరులో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. అంతేకాదు.. అధికార వైసీపీకి చుక్కలు చూపించింది. వాస్తవానికి గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఓడించి.. భారీ రికార్డును సొంతం చేసుకున్న ఆర్కే.. ఇక్కడి ప్రజలు ఎప్పటికీ .. తన వెంటే ఉంటారని.. ప్రకటనలు గుప్పించారు. అయితే.. కేవలం రెండేళ్లు తిరిగే సరికి ఇక్కడ ప్రజల నాడి రివర్స్ కావడం.. సగానికి సగం మండలాల్లో.. వైసీపీ ఓటమిపాలవడం.. ఇప్పుడు ఆర్కే హవా తగ్గుతోందా? అనే చర్చను తెరమీదికి తెచ్చాయి.
దుగ్గిరాల ఫలితం ఇదీ..
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. 13 జిల్లా పరిషత్‌లను ఈ పార్టీ సొంతం చేసుకుంది. పోలింగ్‌కు ముందు ఈ ఎన్నికలను బహిష్కరించినట్టు టీడీపీ ప్రకటించినా.. కొన్నిచోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో పోటీకి నిలిచిన టీడీపీ.. అక్కడ అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మెజార్టీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ 9, వైఎస్ఆర్సీపీ 8, జనసేన 1 స్థానం గెలుపొందాయి.
టీడీపీకే ఎంపీపీ పదవి!
టీడీపీకి మెజారిటీ స్థానాలు రావడంతో ఎంపీపీ పదవి ఆ పార్టీకి దక్కనుంది. జనసేన మద్దతు కూడా ఇక్కడ కీలకం కానుంది. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. దుగ్గిరాల మండలంలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. స్థానికంగా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడంతో ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది.
గతం కంటే పుంజుకున్నట్టేనా?
గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన టీడీపీ నేత నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోరు కూడా నువ్వా-నేనా అన్నట్లు సాగింది. రాష్ట్రంలో టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా ఇక్కడ పోటీలో ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది. నిజానికి ఆళ్ల తమకు తిరుగులేదని.. అన్నీ క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు. కానీ.. టీడీపీ గట్టి పోటీ ఇవ్వడంతో ఆర్కే హవా తగ్గుతోందనే వాదనబలంగా వినిపిస్తుండడం గమనార్హం.