బాబు సెకండ్ లిస్ట్‌!..15 స్థానాల‌కు అభ్య‌ర్థులు!

Update: 2019-03-17 08:20 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీ అభ్య‌ర్థుల ఖ‌రారుపై త‌న‌దైన శైలి వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే తొలి జాబితాను ప్ర‌క‌టించిన ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఒకేసారి ఏకంగా 126 అసెంబ్లీ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. మిగిలిన 49 స్థానాల‌కు రెండో జాబితాలో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తార‌ని భావించినా... షాకుల మీద షాకులు త‌గులుతున్న నేప‌థ్యంలో ఈ జాబితాలో కేవ‌లం 15 మంది అభ్య‌ర్థుల‌నే ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... త‌న పార్టీ నుంచి మూడో జాబితా ఉంటుంద‌ని కూడా చెప్ప‌క‌నే చెప్పేశారు. తాజాగా విడుద‌లైన జాబితాలో 15 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... మిగిలిన అభ్య‌ర్థుల ఖ‌రారును మూడో జాబితా ఓ ముగిస్తారో - లేదంటే నాలుగో జాబితా కూడా ఉంటుంద‌ని చెబుతారో చూడాలి. ఇక రెండో జాబితాలో ప్ర‌క‌టించిన 15 స్థానాల‌కు ఎవ‌రెవ‌రిని బ‌రిలోకి దించారన్న విష‌యానికి వ‌స్తే...

పాల‌కొండ (శ్రీ‌కాకుళం జిల్లా)... నిమ్మ‌క జ‌య‌కృష్ణ‌
పిఠాపురం (ఈస్ట్)... ఎస్వీఎస్ మూర్తి
రామ‌చంద్రాపురం (ఈస్ట్‌)... వంత‌ల రాజేశ్వ‌రి
ఉంగుటూరు (వెస్ట్‌)... గ‌న్ని వీరాంజ‌నేయులు
పెడ‌న (కృష్ణా)... కాగిత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్‌
పామ‌ర్రు (కృష్ణా)... ఉప్పులేటి క‌ల్ప‌న‌
సూళ్లూరుపేట (నెల్లూరు)... ప‌ర్సా వెంక‌ట‌రత్నం
నందికొట్కూరు (క‌ర్నూలు)... బండి జ‌య‌రాం
బ‌న‌గాన‌ప‌ల్లో (క‌ర్నూలు)... బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి
రాయ‌దుర్గం (అనంత‌పురం)... కాల‌వ శ్రీ‌నివాసులు
ఉవ‌ర‌కొండ (అనంత‌పురం)... ప‌య్యావుల కేశ‌వ్‌
తాడిప‌త్రి (అనంత‌పురం)... జేసీ అస్మిత్ రెడ్డి
మ‌డ‌క‌శిర (అనంత‌పురం)... కే. ఈర‌న్న‌
మ‌ద‌న‌ప‌ల్లి (చిత్తూరు)... దొమ్మ‌ల‌పాటి ర‌మేశ్
చిత్తూరు (చిత్తూరు)... ఏఎస్ మ‌నోహ‌ర్‌


Tags:    

Similar News