టీడీపీ స్పీక్స్ : పోల‌వ‌రంపై క‌నీస అవ‌గాహ‌న లేదా?

Update: 2022-04-22 17:45 GMT
తెలుసుకోవ‌డంలో వివేకం ఉంది..తెలుసు అని అనుకోవ‌డంలో అర్థ ర‌హిత చ‌ర్య ఒక‌టి దాగి ఉంది. పోల‌వ‌రం అన్న‌ది సుదీర్ఘ కాలం పాటు తెలుసుకోవాల్సిన విష‌యం. అధ్య‌య‌నం చేయాల్సిన విష‌యం. ఇప్ప‌టిదాకా ఇద్ద‌రు మంత్రులు వైసీపీ స‌ర్కారుకు సంబంధించి నియ‌మితుల‌య్యారు. ఒక‌రు నెల్లూరు కు చెందిన అనిల్ కుమార్ యాద‌వ్ కాగా మ‌రొక‌రు ప‌ల్నాడుకు చెందిన పెద్దాయ‌న అంబ‌టి రాంబాబు. క‌నీసం ఆయ‌న‌కు సోయి లేకుండా మాట్లాడుతూ నిన్న ఆయ‌న దొరికిపోయారు. దీంతో ప్రాజెక్టులు అన్నింటినీ ప‌రిశీలించి వివ‌రాలు తెలుసుకుని, సాంకేతిక సంబంధ ప‌రిజ్ఞానం పెంచుకుని మాట్లాడ‌తాన‌ని మీడియా ఎదుటే చెప్పి త‌ప్పు ఒప్పుకుని త‌ప్పుకున్నారు. ద‌టీజ్ అంబ‌టి ! ఊక‌దంపుడు ఉప‌న్యాసాలకూ ప్రాజెక్టు సంబంధం అయిన మాట‌ల‌కూ ప్ర‌క‌ట‌న‌ల‌కూ ఇదే తేడా అని మంత్రులు తెలుసుకుంటే మేలు.

పోల‌వ‌రం అనే అతి పెద్ద ప్రాజెక్టు ఇంకా చెప్పాలంటే బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు నిర్మాణం త‌రువాత ద‌క్కే ప్ర‌యోజ‌నం వీటిపై ఎవ్వ‌రు అయినా మాట్లాడవ‌చ్చు. మంత్రులు క‌దా అని మాట్లాడ‌డం కాదు కానీ వారికి  క్షేత్ర స్థాయి అవ‌గాహ‌న అయితే లేదు అని తేలిపోయిన విధంగా మాత్రం మాట్లాడ‌కూడ‌దు. గ‌తంలో ప‌నిచేసిన అనిల్ కు కానీ ఇప్పుడు తాజాగా బాధ్య‌త‌లు అందుకున్న అంబ‌టికి కానీ క్షేత్ర స్థాయి వాస్త‌వాలు ముఖ్యంగా టెక్నిక‌ల్ టెర్మినాల‌జీపై అస్స‌లు క‌నీస స్థాయిలో కూడా విష‌య ప‌రిజ్ఞానం లేద‌ని తేలిపోయింది. ముందు ప్రాజెక్టు నిల్వ సామ‌ర్థ్యం ఎంత .. ముంపు గ్రామాలు ఎన్ని.. తాగు నీరు,. సాగునీరు అందుకునే ప్రాంతాలు ఎన్ని.. జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తికి ఉన్న అవ‌కాశాలు, వాటి తరువాత ప‌రిణామాలు వీట‌న్నింటిపై కూడా ఒక్క‌సారి అయినా తెలుసుకుని మాట్లాడితే బెట‌ర్.

జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అంబ‌టి రాంబాబు మంత్రిగా నియ‌మితుల‌య్యారు. ఆయ‌న నేతృత్వంలో అయినా పోల‌వ‌రం ప‌నులు పూర్తి అవుతాయ‌ని ఆశించాలి. ముందుగా ఆయ‌న‌కు ఉన్న అవ‌గాహ‌న కాస్త పెంచుకుని మాట్లాడితే సంబంధిత స‌మ‌స్య‌లు అవే ప‌రిష్కారం అవుతాయి. పోల‌వ‌రం విష‌య‌మై ఇప్ప‌టికే కొంత ప‌ని పూర్త‌యిన‌ప్ప‌టికీ ప్రాజెక్టు కు సంబంధించి కొన్ని కీల‌కం అయిన ప‌నులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. వీటిపై ముందు మంత్రి దృష్టి సారించాలి. అస‌లు సాంకేతిక సంబంధ అంశాలపై పూర్తి అధ్య‌య‌నం చేశాకే ప్రెస్మీట్లు పెడితే ఎవ్వ‌రికీ ఏ ఇబ్బందీ ఉండ‌దు. కానీ ఆయ‌న మాత్రం క‌నీస అవ‌గాహ‌న అన్న‌ది లేకుండానే మాట్లాడుతూ మొద‌టి మీడియా మీట్ తోనే న‌వ్వుల పాల‌య్యారు. ఇక ప‌రిహారం విష‌యంలో కూడా ఇప్ప‌టిదాకా ఉన్న భ్ర‌మ‌లు తొల‌గించే ప‌నుల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి నోచుకుంటాయి.

ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత, అప్ప‌టి ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు స్పందించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా కూడా ప్రాజెక్టు ప‌నుల‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం క‌నీస శ్ర‌ద్ధ వ‌హించ‌లేద‌ని మండిప‌డ్డారు. తెలిసీ తెలియని త‌త్వంతో మంత్రులు మాట్లాడ‌వ‌ద్ద‌ని, అవ‌గాహ‌న లేమి కార‌ణంగా తెలుగు జాతికి ద్రోహం చేయ‌వ‌ద్ద‌ని చెప్పి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాల కార‌ణంగానే ప్రాజెక్టు ప‌నుల్లో వేగం లేకుండా పోయింద‌ని ఆరోపించారు. మంత్రుల తీరు పై ఆవేద‌న చెందారు.
Tags:    

Similar News