ఈ కథనం కేవలం టీడీపీ చేస్తున్న విమర్శలు ఆధారంగా రాసింది. సోషల్ మీడియాలో వస్తున్న అభియోగాలు మరియు ఆరోపణల నేపథ్యంలో రాసిన కథనం ఇది. చాలా రోజులుగా జరుగుతున్న బిగ్ ఫైట్ లో భాగంగా ఇదొక బిగ్ బైట్..
రాజకీయాలలో స్నేహాలు మారుతాయి. శత్రుత్వాలూ మారుతాయి. మారనిది ఒక్కటే అదే గెలుపు సాధించాలన్న ఆరాటం. ఈ ఆరాటంలో భాగంగా చాలా మంది చాలా ప్రయత్నాలే చేస్తారు. అవి సఫలీకృతం కాకపోయినా సరే పట్టు వదలరు. అనుకున్నది సాధించేదాకా ఏవో మార్గాలయితే వెతికి వెతికి విసిగి ఉంటారు.అయినా కొత్త ఉత్సాహంతో పనిచేయాలన్న ఆరాటం ఒక ఆలంబనగా వీళ్లలో ఉంటుంది. ఆ విధంగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తనదైన పంథాలో దూసుకుపోవాలన్న ఆరాటంలో భాగంగా విభిన్న ప్రజా ఉద్యమాలకు తెరదీస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ధర్నాలు, రాస్తారోకోలు కాకుండా ఇంకా విభిన్నంగా జనంలోకి పోయి, కరపత్రాలు ముద్రించి, ఇంటింటికీ తిరిగి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే సమయంలో కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఎప్పటి నుంచో వైసీపీ ఓ మాట చెబుతోంది. తాము సింగిల్ గానే వస్తామని సింహం సింగిల్ గానే వస్తుందని కూడా అంటోంది. సింహం సింగిల్ గానే వస్తుంది.. అన్న మాట జగన్-ను ఉద్దేశించి అంటోంది. అంటే సింహం సింగిల్ అయితే .. స్నేహం ఏమవ్వాలి.. ప్లూరల్ సెన్సులో ఉండాలా? ఎందుకంటే బీజేపీతో ఎప్పటి నుంచో స్నేహం ఉంది కనుక దీనిని ఏ మాత్రం కొట్టిపారేయలేం అని ఓ విధంగా కేంద్రంలో మాటలు యథాతథంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి కనుక ఈ డబుల్ ఇంజిన్ మోడల్ సర్కారుకు స్నేహం ప్లూరల్ సెన్సులోనే ఉంటుంది అని, అదేం తప్పు కాకపోయినా రాష్ట్రానికి ఏం కావాలో ఏం రావాలో అడిగి తెచ్చుకోవడం మరియు నిలదీసి అడిగి తేల్చుకోవడం అన్నవే చేయడం లేదని టీడీపీ అంటోంది. ఆ ఇద్దరి స్నేహం ఫ్యూడల్ కూడా అన్న మాట ఒకటి వినిపిస్తోంది వైసీపీ విషయంలో !
అవును వైజాగ్ లో అయినా ఎక్కడయినా బీజేపీ కి అనుగుణంగా కొన్ని పనులు వైసీపీ చేసిపెట్టిందన్న ఆరోపణలు చేస్తూ ఫ్యూడల్ అన్న పదం కూడా ప్రచారంలోకి తెచ్చింది. ఓ విధంగా వైసీపీది ఫ్యూడలిజం అని ఎప్పటి నుంచో టీడీపీ అభియోగాలు చేస్తూ వస్తుంది. కనుక స్నేహం ఫ్యూడల్ అన్న మాట కూడా తప్పేం కాదు. అని సమర్థించుకుంటోంది టీడీపీ.