కరోనా నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్ విద్యా భోధన జరుగుతుంది. అయితే , కొన్ని చోట్ల ఆన్ లైన్ క్లాసులలో కూడా కొన్ని ఘోరాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని శేషాద్రి బాల విద్యా భవన్ అనే కార్పొరేట్ పాఠశాలలో అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్ బోధించే రాజగోపాలన్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించ్చాడు. ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా పర్సనల్ గా అసభ్య కంటెంట్ ను పంపించడం, మెసేజ్ లు చేయడం వంటివి చేస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని, తన ఛాతీని చూపిస్తున్నాడని విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
దీంతో సదరు ఉపాధ్యాయుడిని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు పోలీసులు సైతం పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక నంగనల్లూరులో నివసిస్తున్న రాజగోపాలన్ కరోనా వ్యాప్తి కారణంగా పాఠశాలను మూసివేయడంతో గత ఏప్రిల్ నుంచి ఆన్ లైన్ లో విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నాడు. ఇలా యేడాదిపాటు ఆ కామర్స్ టీచర్ కామ వేధింపులను తట్టుకోలేక ఆ స్కూలు పాత విద్యార్థినులు, కొత్త విద్యార్థినులు ఓ వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఆ టీచర్ అసభ్య ప్రవర్తనలకు సంబంధించి తమ వద్దనున్న ఆధారాలను వెల్లడించడంతో ఈ లైంగిక వేధింపులు బహిర్గతమయ్యాయి. రాజగోపాలన్ పంపిన వాట్సప్ సందేశాలను స్ర్కీన్ షాట్స్ గాను, వీడియో కాల్స్‌ను రికార్డు చేసి మరీ ఆ వాట్సప్ గ్రూపులో విడుదల చేయడం సామాజిక ప్రసార మాధ్యమాల్లో సంచలనం కలిగించింది.
దీనితో ఈ వ్యవహారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ పొయ్యామొళి దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి సైతం స్పందించారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్కూలు యాజమాన్యం తక్షణమే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. అయితే, ఆ టీచర్ దుష్ప్రవర్తన గురించి తమకు ఇంత వరకు తెలియదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. కీచక టీచర్ అంశం బయట పడగానే ఆ విషయం పై ప్రస్తుత విద్యార్థినిలే కాకుండా పూర్వ విద్యార్థినిలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతేడాది ఆన్ లైన్ క్లాస్ ల సమయంలోనూ అతను ఇలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. పలువురు విద్యార్థినిలు సోషల్ మీడియా వేదికగా అతని అరాచకాలను బట్టబయలు చేశారు. అశ్లీలంగా బోధించిన వీడియోలు, అతను పంపిన మెసేజ్ ల తాలూకు స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.
ఈ వ్యవహారం బయటకి రాగానే .. కామర్స్ టీచర్ రాజగోపాలన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ స్కూలు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం సాయంత్రం పోలీసులు నంగనల్లూరు నివాసగృహంలో ఉన్న టీచర్ రాజగోపాలన్ అరెస్టు చేశారు. ఆ ఇంటిలో రాజగోపాలన్ వాడుతున్న ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలన జరిపారు. ల్యాప్‌టాప్‌లోనూ, సెల్‌ఫోన్‌లోను విద్యార్థినుల పంపిన సందేశాలను రాజగోపాలన్ తొలగించినట్టు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే అరెస్ట్ చేసిన టీచర్ ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి తీసుకుని విచారణ జరపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆ టీచర్ వేధింపులపై బాధిత విద్యార్థినులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ స్కూలులో చదివిన పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినులు కలిస వాట్సప్ గ్రూప్‌లో వెలువరించిన సమాచారాలు, వివరాల ఆధారంగానే రాజగోపాలన్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటనపై ప్రముఖ సినీనటుడు వైజీ మహేంద్రన్ స్పందిస్తూ పద్మాశేషాద్రి భాలభవన్ విద్యా సంస్థలకు తాను ట్రస్టీని మాత్రమేనని, కామర్స్ టీచర్ విద్యార్థినులపై లైంగింక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం వెలువడగానే స్కూలు నిర్వాహకులను విచారణ జరపమని ఆదేశించానని తెలిపారు.