హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను హెచ్-4 వీసా కింద ఉద్యోగాలు చేసేందుకు అనుమతించాలని అమెరికా ప్రభుత్వానికి ఆపిల్ - మైక్రోసాఫ్ట్ - ఫేస్ బుక్ - గూగుల్ తోపాటు పలు ఐటీ దిగ్గజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఐటీ పరిశ్రమ మండలి - అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ - బీఎస్ ఏ (ది సాఫ్ట్ వేర్ అలయెన్స్) తదితర సంఘాలు శుక్రవారం అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ లీ ఫ్రాన్సిస్ సిస్నాకు లేఖ రాశాయి. ‘గ్రీన్ కార్డు’ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న హెచ్ 1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పని చేసేందుకు ఒబామా హయాంలో అమలుచేసిన హెచ్-4 విధానాన్ని కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నాయి.
‘మనదేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో సంస్కరణల అమలు కార్యక్రమం విఫలమైంది. ఈ నేపథ్యంలో పనిచేసేందుకు అనుమతించకపోవడంతో హెచ్-1 గ్రూప్ జీవిత భాగస్వాములు.. మెజారిటీ మహిళలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఆ లోపాలను అధికార యంత్రాంగం సరిచేస్తుందన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారు’ అని ఆ లేఖలో పేర్కొన్నాయి. ఒబామా హయాంలో అమలుచేసిన హెచ్-4 నిబంధన వల్ల వేల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరింది. కానీ అమెరికా నిపుణులకు ఉపాధి లభించనందున హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పనిచేసేందుకు అనుమతించరాదన్న దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
హెచ్-1బీ ఉద్యోగులు - వారి కుటుంబాలు శాశ్వత పౌరసత్వం (గ్రీన్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారికి వ్యక్తిగత - ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా హెచ్-4 ఉపకరించింది. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారు ఎదుర్కొంటున్న పరిమితులను తొలిగించడానికి చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపాయి. 2017 అక్టోబర్ నాటికి గ్రీన్ కార్డు దరఖాస్తులు 1,33,502 పెండింగ్ లో ఉన్నాయని అమెరికా సిటిజన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొన్నది.