టెక్నికల్ తోపుగా చెబుతారు హైదరాబాద్ మెట్రో రైల్‌ను. ఎంత తోపు అయినప్పటికీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక లోపం మామూలే. తాజాగా అలాంటి లోపాన్ని బయటకు తీశారు హైదరాబాదీలు. ఏళ్లకు ఏళ్లుగా వెయిట్ చేస్తున్న మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రావటం తెలిసిందే. అయితే.. ఇందులో ప్రయాణించే ప్రయాణికులు కాస్త తెలివిగా వ్యవహరిస్తే.. ఛార్జీ చెల్లించకుండా మస్కా కొట్టొచ్చన్న మాట వినిపిస్తోంది. అదెలా అన్న విషయాన్ని తాజాగా బయటపెట్టిందో ప్రముఖ మీడియా.
మెట్రో రైల్ వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిన ఈ వ్యవహారం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఇంతకీ మెట్రోకు మస్కా ఎలా కొట్టొచ్చన్న విషయానికి వస్తే.. మెట్రో ప్రయాణానికి అయితే టోకెన్ సిస్టం కానీ లేదంటే స్మార్ట్ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. టోకెన్ తో మస్కా కొట్టటం సాధ్యం కాదు. కానీ.. స్మార్ట్ కార్డుతో మాత్రం ఎంచక్కా జర్నీ చేసి మరీ ఛార్జీ కట్టకుండా ఉండొచ్చని చెబుతున్నారు.
ఇద్దరు స్నేహితులు తమ దగ్గరున్న స్మార్ట్ కార్డుతో మెట్రో స్టేషన్లో అమీర్ పేటకు వెళ్లారు. వారిద్దరూ మియాపూర్ వెళ్లే ట్రైన్ ఎక్కారు. ట్రైన్ దిగిన తర్వాత ఎస్కలేటర్ సాయంతో మియాపూర్ స్టేషన్ కింద వరసలోకి వచ్చేసి.. మళ్లీ మియాపూర్ నుంచి అమీర్ పేట వెళ్లే ఫ్లాట్ ఫాం మీదకు వెళ్లారు. మరో రైల్లో అమీర్ పేట స్టేషన్ కు వెళ్లారు. ఇక్కడ కాసేపు ఫ్లాట్ ఫాం మీద గడిపేసి.. ఎగ్జిట్ నుంచి అమీర్ పేటకు బయటకు వచ్చేశారు. అయితే.. పరిమితికి మించి ఫ్లాట్ ఫాం మీద గడిపినట్లుగా భావించి కేవలం రూ.10 మాత్రమే ఫైన్ కింద వసూలు చేశారు. వాస్తవానికి అమీర్ పేట నుంచి మియాపూర్ రూ.40 చార్జీ అవుతుంది. అంటే ఇద్దరు స్నేహితుల నుంచి రూ.80 చొప్పున రూ.160 వసూలు చేయాల్సింది పోయి రూ.20 మాత్రమే చెల్లించారు. సాంకేతికంగా ఉన్న ఈ సమస్యనుఎగ్జిట్ పాయింట్ల దగ్గర మరింత సెక్యూరిటీని నియమించటం ద్వారా మస్కా కొట్టే వైనానికి చెక్ పెట్టొచ్చొని చెబుతున్నారు. మరి.. మెట్రో అధికారులు ఎప్పటికి తమ సాంకేతిక లోపాన్ని అధిగమిస్తారో చూడాలి.