ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగిస్తున్న జీపీఎస్ గేమ్ పోకెమాన్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఓ స్కూల్ విద్యార్థి చేష్టలు షాకింగ్ కలిగించేలా ఉన్నాయి. పోకెమాన్ క్యారెక్టర్లను సేకరించే ఆతృతలో చేతుల్లో ఉన్న స్టీరింగ్ వీల్ ను వదిలేశాడు కుర్రాడు. దీంతో కారు కాస్తా స్కూలు ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. ఆపై లోపలికి దూసుకెళ్లి క్లాస్ రూంను చిందర వందర చేసేసింది. కారు కూడా డ్యామేజ్ అయింది. కొసమెరుపు ఏంటంటే వ్రతం చెడ్డా ఫలం దక్కని చందంగా.. కారు దెబ్బతిన్నా ఆ కుర్రాడికి పోకెమాన్ క్యారెక్టర్ మాత్రం దొరకలేదట!
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ - బెర్విక్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. బెర్విక్ పట్టణానికి చెందిన ఓ పందొమ్మిదేళ్ల కుర్రాడు కారులో పోకెమాన్ ఆడుతూ ప్రయాణిస్తున్నాడు. కాసేపటికి ఆటలో లీనమైపోయి తాను కారు నడుపుతున్నాననే విషయం మరిచిపోయాడు. దాంతో కారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కాలేజ్ ఆవరణలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. కాగా మెల్ బోర్న్‌లోని మెర్విక్ పట్టణంలో పోకెమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేయొద్దు అంటూ ఎలక్టనిక్ సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారట! ఈ బోర్డులు ఏర్పాటు చేసిన రోజుల వ్యవధి లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.