ఏపీ ముఖ్యమంత్రి ఇంటి వద్ద తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారా? ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారా? ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారంపై తెలంగాణ ఏసీబీ కన్నేసిందా? లాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తుంది.
తాజాగా తెలంగాణ ఏసీబీ అధికారుల ఓవర్ యాక్షన్.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు విభేదాల నడుమ.. ఓటుకు నోటు వ్యవహారంతో అడ్డంగా దొరికిపోవటమే కాదు.. ఈ విషయాన్ని వదిలేయాలని చెప్పటమే కాదు.. క్షమాపణలు చెప్పటంతో వివాదం ముగిసిందని అనిపించినా.. బుధవారం చోటు చేసుకున్న పరిణామాలతో మళ్లీ వేడెక్కిందన్న భావన వ్యక్తమవుతోంది.
జూబ్లీహిల్స్ లోని ఏపీ ముఖ్యమంత్రి ఇంటి వద్దకు మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమను తాము పోలీసులమని పరిచయం చేసుకున్న వారు.. అక్కడి సిబ్బందితో మాట్లాడటం మొదలు పెట్టారు.
బాబు నివాసం వద్ద పని చేస్తున్న తెలంగాణ పోలీసులతో మాటలు కదిపి.. వారి అనుమతితో బాబు నివాసం వద్దకు వచ్చారు. అక్కడ ఏపీ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. వారితో మాట్లాడిన ఇద్దరూ.. బాబు ఇంటి వద్ద విధుల్లో ఉండే గన్ మెన్ల వివరాలు.. డ్రైవర్ల వివరాల్ని రాసుకోవటం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులు.. లోపలున్న భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.
ఇద్దరిని లోపలకు పిలిచి వివరాలు అదగ్గా.. తాము ఏసీబీ నుంచి వచ్చామని చెప్పటంతో భద్రతాధికారులు వారిని సోదా చేయగా.. వారు నమోదు చేసుకున్న కాగితాలు లభ్యమయ్యాయి. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఒక ముఖ్యమంత్రి ఇంటి వద్దకు వచ్చి సమాచారం సేకరించటం ఏమిటని భద్రతాధికారులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తే.. తమకేమీ తెలీదని.. ఉన్నతాధికారుల మాటతో తాము వచ్చామని చెబుతూ పరుపరుగున వెళ్లిపోయారు.
అయితే.. ఈ ఉదంతానికి సంబంధించిన మొత్తం వ్యవహారం సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. దీనిపై అగ్రహం చెందిన చంద్రబాబు భద్రతాధికారులు.. ఏసీబీలోని ఉన్నతాధికారులకు ఫోన్లు చేశారు. ఉమ్మడి రాజధానిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి వద్దకు అధికారుల్ని పంపి సమాచారం సేకరించటం ఏమిటని అడగటంతో పాటు.. మేం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి వద్దకు ఇలానే చేస్తే ఎలా ఉంటుందని నిలదీసినట్లుగా చెబుతున్నారు.
దీనికి స్పందించిన టీ ఏసీబీ అధికారులు.. జరిగిన విషయాన్ని వదిలేయాలని పేర్కొంటూ క్షమాపణలు చెప్పేయటంతో బాబు భద్రతాధికారులు వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన జరిగిన రోజు తర్వాత.. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ కారు డ్రైవర్ కు అదే ఏసీబీ నోటీసులు జారీ చేసి.. ఒక్కరోజు వ్యవధిలో తమ వద్దకు హాజరు కావాలని పేర్కొనటం గమనార్హం.