అది అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం.. ఇక దేశంలోనే అత్యధిక వృద్ధిరేటుతో దూసుకెళుతోంది తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు జట్టుకట్టాయి.. విద్యా - వ్యాపార - వాణిజ్య - పారిశ్రామిక రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ మేరకు న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీలు - తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిలు ఒప్పందాలు చేసుకున్నారు.
తాజాగా తెలంగాణలో పర్యటిస్తున్న న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధుల బృందానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలికారు. వారితో ఒప్పందానికి చొరవచూపారు. న్యూజెర్సీతో తెలంగాణ రాష్ట్రం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకునేలా కేటీఆర్ చొరవ చూపించారు.
ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రం - న్యూజెర్సీ రాష్ట్రాలు ఐటీ - ఫార్మా లైవ్ సైన్సెస్ - బయోటిక్ - ఫిన్ టెక్ - డేటా సెంటర్స్ - క్లీన్ ఎనర్జీ - ఉన్నతవిద్య - టూరిజం వంటి రంగాల్లో పరస్పరం ముందుకు వెళుతాయి. ఒప్పందంతో ప్రధానంగా తెలంగాణకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను కూడా న్యూజెర్సీలో ఉన్నానని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ కు కేటీఆర్ తెలిపారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా ఈ ఒప్పందం జరిగిందన్నారు.