తెలంగాణ ఏరో స్పేస్ హబ్ గా మారనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో వైమానిక రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ రంగంతో పాటు అంతరిక్ష, రక్షణ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వైమానిక, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.
ఈ రంగాల అభివృద్ధి నిర్వహణ , అందుకు సంబంధించిన మరమ్మతులు, ఓవర్ హోలింగ్ పనులు ఇలా అన్ని రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముమ్మరంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఎంఆర్‌వో రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో జీఎంఆర్, ఎయిరిండియా సంస్థలు పరిశోధనలు ప్రారంభించాయి. బేగంపేట విమానాశ్రయంలో ఎంఆర్ వో హబ్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆసక్తి చూపుతోంది.
ఎంఆర్ వో రంగం ఏటా 15శాతం వృద్ధి రేటుతో రూ.10వేల కోట్ల పరిశ్రమంగా భారత్ ఎదుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహారాష్ట్ర, దిల్లీ ముందు స్థానాల్లో ఉండగా తెలంగాణ కూడా అదే బాటలో నడవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఇంకా చాలా దేశీయ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. టాటా గ్రూప్ 90 శాతం ఏరో స్పేస్ పనులు ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆ దిశగా వైమానిక, రక్షణ రంగాల్లోని అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడంపై ఎంఆర్ వో రంగం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. ఆ దిశగా రాష్ట్రంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నైపుణ్య శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కార్యరూపం దాల్చితే మరో అయిదేళ్లలో తెలంగాణ ఏరో స్పేస్ హబ్ గా మారుతుందని పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు.