తెలంగాణ అథ్లెటిక్ బృందం జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అంచనాలు లేని తెలంగాణ టీం ఇలా రెండోస్థానంలో నిలవడంలో ఓ అథ్లెట్ కృషి - పట్టుదల ఉంది. ఆమె దివ్యారెడ్డి. ఆమె ప్రతిభకు ఇప్పుడు ఆమెకే కాదు తెలంగాణకు పతకాల పంట పడింది. తెలంగాణ కీర్తి దేశవ్యాప్తం అయ్యింది.
గోవా రాష్ట్రంలో జరుగుతున్న తాజా జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో తెలంగాణ అథ్లెట్ దివ్యారెడ్డి నాలుగు పతకాలతో సత్తా చాటింది. 35 ఏళ్ల విభాగంలో రన్నింగ్ లో ఏకంగా రెండు స్వర్ణాలు - ఒక రజితం - ఒక క్యాంస పతకం సాధించి అబ్బుర పరిచింది.
దివ్యారెడ్డి 400 మీటర్లు - 800 మీటర్ల పరుగు పందెంలో రికార్డు నిమిషాల్లోనే పరిగెత్తి బంగారు పతకాలు సాధించింది. 400 మీటర్లను 1నిమిషం 15 సెకన్లలో.. 800 మీటర్లను 3 నిమిషాల 3 సెకన్లలో చేధించడం విశేషం. ఇక 1500 మీటర్ల రన్నింగ్ ను 6 నిమిషాల 41 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించింది.
ఇక ఈమె సభ్యురాలిగా ఉన్న గ్రూపు నలుగురి రన్నింగ్ లో తెలంగాణ బృందం 4x100 మీటర్ల రిలే రేసులో రెండోస్థానంలో నిలిచారు.
గోవా జాతీయ అథ్లెటిక్స్ లో విశేషంగా రాణించిన దివ్యారెడ్డి ఈ ఏడాది డిసెంబర్ లో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగే ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ లోనూ భారత జట్టు తరుఫున పాల్గొనే అవకాశాన్ని ఈమె దక్కించుకుంది.